వైద్యం వికటించి నిండు గర్భిణీ మృతిచెందిన సంఘటన నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఆదివారం వెలుగుచూసింది
సికింద్రాబాద్: వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణీ మృతి చెందిందని êబాధితులు ఆందోళనకు దిగిన సంఘటన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం జరిగింది. నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడకు చెందిన సరస్వతి పురుటి నొప్పులతో శనివారం గాంధీ ఆసుపత్రి వచ్చింది. ఆసుపత్రి వచ్చే సమయానికే కడుపులో బిడ్డ చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. అయితే సర్జరీ చేసి చనిపోయిన బిడ్డను తీయాల్సిన వైద్యులు ఆ పని చేయలేదు.
నిన్నటి నుంచి వైద్యం అందక మృతురాలు సరస్వతి మృతి చెందింది. ఈ విషయంపై మృతురాలి బంధువులు నిలదీయగా వైద్యులు వెటకారంగా మాట్లాడరని వారు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మృతురాలు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో గాంధీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.