చౌరస్తాలన్నీ మూసివేస్తూ యూటర్న్‌లకు శ్రీకారం చుడుతూ వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జీవీకే వన్ చౌరస్తాలో కూడా వన్‌వేను ఏర్పాటు చేశారు.
- వాహన దారులకు చుక్కలు చూపెడుతున్నట్రాఫిక్
బంజారాహిల్స్
చౌరస్తాలన్నీ మూసివేస్తూ యూటర్న్‌లకు శ్రీకారం చుడుతూ వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్న బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు జీవీకే వన్ చౌరస్తాలో కూడా వన్‌వేను ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి ఇక్కడ వన్‌వే అమల్లోకి వచ్చింది.
ఇప్పటి వరకు వాటర్‌వర్క్స్ కార్యాలయం నుంచి జీవీకే చౌరస్తా మీదుగా తాజ్‌కృష్ణా వైపు వాహనాలు వెళ్లేవి. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల వాటర్‌వర్క్స్ కార్యాలయం నుంచి ఎడమవైపుకు తీసుకొని పోస్టాఫీస్ వద్ద యూటర్న్ చేసుకొని తాజ్‌కృష్ణా వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఇక జీవీకే వైపు నుంచి వాటర్‌వ ర్క్స్ కార్యాలయం వైపు వెళ్లే వాహనదారులు తాజ్ కృష్ణా చౌరస్తాలో యూటర్న్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల వాహనదారులు పడుతున్న పాట్లు అన్నీఇన్నీకావు.