పరిపాలన 'వారికి' అనుకూలంగా సాగుతోంది: నాగం | nagam janardhan reddy takes on trs government | Sakshi
Sakshi News home page

పరిపాలన 'వారికి' అనుకూలంగా సాగుతోంది: నాగం

Jul 14 2016 3:09 PM | Updated on Mar 29 2019 9:07 PM

తెలంగాణలో పరిపాలన కాంట్రాక్టర్లకు, కేసీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా సాగుతోందని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : తెలంగాణలో పరిపాలన కాంట్రాక్టర్లకు, కేసీఆర్ ఫ్యామిలీకి అనుకూలంగా సాగుతోందని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో నాగం జనార్దన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రాజెక్టుల వ్యయం పెంచే విషయంలో కేసీఆర్ ప్రమేయం లేకుంటే... 146 జీవోపై సీబీఐ విచారణ జరిపించాలని నాగం డిమాండ్ చేశారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేలా ప్రాజెక్టుల పనులు చేయిస్తున్నారని నాగం జనార్దన్రెడ్డి విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement