అవినీతి సొమ్మును కక్కించడానికే కోర్టుకు | nagam janardhan reddy fired on kcr corruption | Sakshi
Sakshi News home page

అవినీతి సొమ్మును కక్కించడానికే కోర్టుకు

Jul 22 2016 3:23 AM | Updated on Sep 22 2018 8:22 PM

అవినీతి సొమ్మును కక్కించడానికే కోర్టుకు - Sakshi

అవినీతి సొమ్మును కక్కించడానికే కోర్టుకు

సీఎం కేసీఆర్ నుంచి అవినీతి సొమ్మును కక్కించడానికే న్యాయస్థానంలో పోరాడుతున్నానని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు.

బీజేపీ నేత నాగం...
సాక్షి, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నుంచి అవినీతి సొమ్మును కక్కించడానికే న్యాయస్థానంలో పోరాడుతున్నానని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... జీఓ 146ను అడ్డం పెట్టుకుని కేవలం 10-15 శాతం మిగిలిపోయిన ప్రాజెక్టులకు కూడా అంచనాల విలువను భారీగా పెంచారన్నారు. బకాసురుని రూపంలో, ఖాసీం రజ్వీ రూపంలో ఉన్న టీఆర్‌ఎస్ తింటున్న ప్రజల సొమ్మును కక్కించడానికే కోర్టును ఆశ్రయించినట్టు నాగం ప్రకటించారు. కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిచేసిన ప్రాజెక్టులకిప్పుడు ప్రారంభోత్సవాలు చేయడం అనైతికమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement