మహిళ దారుణ హత్య | missing women dead body found | Sakshi
Sakshi News home page

మహిళ దారుణ హత్య

Jan 6 2016 1:02 PM | Updated on Sep 3 2017 3:12 PM

నగరంలోని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అదృశ్యం అయినట్లు కేసు నమోదు అయిన మహిళ బుధవారం శవమై తేలింది.

హైదరాబాద్: నగరంలోని కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం అదృశ్యం అయినట్లు కేసు నమోదు అయిన మహిళ బుధవారం శవమై తేలింది. స్థానిక రోషన్‌గుడకు చెందిన వెంకటమ్మ(42) అనే మహిళ  గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయింది. ఈ నేపథ్యంలో వెంకటమ్మ కనిపించడం లేదని కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గుర్తుతెలియని దుండగులు ఆమెను హత్యచేసి డీఆర్‌డీఎల్ వెనుక భాగంలోని చెట్ల పొదల్లో పడేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement