రేపటి నుంచి ఉల్లి కొనుగోళ్లు షురూ... | malak pet onion purchases starts from friday | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ఉల్లి కొనుగోళ్లు షురూ...

Nov 24 2016 2:27 PM | Updated on Sep 22 2018 7:57 PM

మలక్‌పేట్ మార్కెట్ ఉల్లి వ్యాపారులతో అధికారుల చర్చలు సఫలమయ్యాయి.

హైదరాబాద్ : మలక్‌పేట్ మార్కెట్ ఉల్లి వ్యాపారులతో అధికారుల చర్చలు సఫలమయ్యాయి. గురువారం మలక్‌పేట్ మహబూబ్‌మాన్షన్ మార్కెట్ వ్యాపారులతో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారధి చర్చలు జరిపారు. నిలిపివేసిన కొనుగోళ్లను శుక్రవారం నుంచి మొదలుపెట్టేందుకు ఈ సందర్భంగా వ్యాపారులు అంగీకరించారు. అలాగే, మార్కెట్‌లో మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన సమ్మతించారు. పెద్ద నోట్ల రద్దుతో గత 11 రోజులుగా ఉల్లి కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement