భాను కిరణ్ వద్ద మళ్లీ మందు బాటిల్, బిర్యానీ | Liquor, biryani Captured from Bhanu Kiran in charlapally jail again | Sakshi
Sakshi News home page

భాను కిరణ్ వద్ద మళ్లీ మందు బాటిల్, బిర్యానీ

May 21 2014 12:25 PM | Updated on Sep 2 2017 7:39 AM

భాను కిరణ్ వద్ద మళ్లీ మందు బాటిల్, బిర్యానీ

భాను కిరణ్ వద్ద మళ్లీ మందు బాటిల్, బిర్యానీ

చర్లపల్లి సెంట్రల్ జైల్లో మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వద్ద మరోసారి మద్యం, బిర్యానీని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వద్ద మరోసారి మద్యం, బిర్యానీని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ అతని వద్ద నుంచి మద్యం బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు, సెల్ ఫోన్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

కాసులకు కక్కుర్తిపడి కరుడుగట్టిన నేరస్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  దాంతో జైళ్ల శాఖ డీజీ తనిఖీలు నిర్వహించి.... సదరు సిబ్బందిపై వేటు వేసినా ఫలితం లేకపోయింది. జైలు సిబ్బంది మామూళ్లు తీసుకొని బిర్యానీ, మద్యం దగ్గర నుంచి బయటి వ్యక్తులతో మాట్లాడి దందాలు చేసేందుకు సెల్‌ఫోన్లు కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు తనిఖీలు నిర్వహించినా అవి తూతూ మంత్రంగానే మిగిలిపోతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement