'ఆ రెండింటిలోనూ మాదే గెలుపు' | Jupally Krishna rao takes on T congress party | Sakshi
Sakshi News home page

'ఆ రెండింటిలోనూ మాదే గెలుపు'

Dec 31 2015 5:27 PM | Updated on Sep 3 2017 2:53 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాదు నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికలోనూ గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు.

హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కాదు నారాయణ్ఖేడ్ ఉప ఎన్నికలోనూ గెలుపు టీఆర్ఎస్ పార్టీదే అని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు. గురువారం హైదరాబాద్లో జూపల్లి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనైతిక పొత్తులు పెట్టుకుందని ఆరోపించారు. చివరకు కాంగ్రెస్ పార్టీ టీడీపీ, బీజేపీతో కూడా కుమ్మక్కైందని విమర్శించారు. భవిష్యత్లో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ అడ్రస్ గల్లంతు అవుతాయని జూపల్లి కృష్ణారావు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement