ఉద్యోగాల పేరిట వ్యభిచారం రొంపిలోకి... | hyderabad woman complaint on human trafficking to hrc | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట వ్యభిచారం రొంపిలోకి...

Aug 11 2015 2:56 PM | Updated on Sep 3 2017 7:14 AM

ఉద్యోగాల పేరిట వ్యభిచారం రొంపిలోకి...

ఉద్యోగాల పేరిట వ్యభిచారం రొంపిలోకి...

రాష్ట్ర రాజధాని కేంద్రంగా సాగుతున్న మహిళల అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కేంద్రంగా సాగుతున్న మహిళల అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూరు వ్యభిచారం గృహం నుంచి తప్పించుకుని వచ్చిన ఓ మహిళ... మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించడంతో ఈ ఉదంతం బయటకు వచ్చింది.

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాపై గోల్కొండ ప్రాంతానికి చెందిన అజురా బేగం మంగళవారం ఫిర్యాదు చేసింది. దుబాయ్ లో ఉద్యోగం పేరుతో ఆమెను వారం క్రితం బెంగళూరులోని వ్యభిచార గృహానికి తరలించారు. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి ఆమె హెచ్చార్సీని ఆశ్రయించింది. తనతో పాటు వ్యభిచారం కూపంలో మగ్గుతున్న మరో 20 మందిని రక్షించాలని హెచ్చార్సీని ఆమె కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement