గ్రూప్-2 పరీక్ష యథాతథం.. వాయిదా అబద్ధం | Group-2 exam will be held on apirl 24 to april 25, says Ganta chakrapani | Sakshi
Sakshi News home page

గ్రూప్-2 పరీక్ష యథాతథం.. వాయిదా అబద్ధం

Mar 10 2016 8:46 PM | Updated on Sep 3 2017 7:26 PM

వచ్చే నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న గ్రూపు-2 రాత పరీక్ష యథాతథంగా ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు.

సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న గ్రూపు-2 రాత పరీక్ష యథాతథంగా ఉంటుందని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. పరీక్షను వాయిదా వేస్తారంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఇటీవల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు ఎంపికైన 904 మంది అభ్యర్థుల జాబితాలను (శాఖల వారీగా కేటాయించిన ఉద్యోగుల జాబితా) వివిధ శాఖల ఇంజనీర్ ఇన్ ఛీఫ్‌లకు టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. మరో వారం రోజుల్లో 1050 ఏఈ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామన్నారు.

గ్రూపు-2 మినహా తాము నోటిఫికేషన్లు ఇచ్చిన అన్నింటి భర్తీని ఈనెలాఖరుకల్లా పూర్తి చేస్తామన్నారు. వచ్చే నెలలో గ్రూపు-2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విధానం అమలుతోపాటు కేంద్రాల్లో జామర్లను ఏర్పాటు చే స్తామన్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఖాళీలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేసే ఆలోచన చేస్తోందన్నారు. సింగరేణి సంస్థ కూడా తమ వద్ద ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని కోరిందని, అయితే అది ప్రభుత్వం నుంచి రావాలని చెప్పామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ఇండెంట్ ఇంకా తమకు రాలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement