బంగారు ఆభరణాల సూట్‌కేస్ చోరీ | gold ornaments suitcase theft in hyderabad lb nagar case filed | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణాల సూట్‌కేస్ చోరీ

Nov 15 2016 7:56 PM | Updated on Sep 7 2018 4:33 PM

బంగారు ఆభరణాలు ఉన్న సూట్‌కేస్ అదృశ్యమైన సంఘటన ఎల్‌బీనగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

హైదరాబాద్ ‌: బస్టాండ్‌లో ప్రయాణికుడి వద్ద బంగారు ఆభరణాలు ఉన్న సూట్‌కేస్ అదృశ్యమైన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫీర్జాదీగూడ కృష్ణనగర్‌కు చెందిన రాము (45) ప్రైవేటు ఉద్యోగి. గుంటూరు నర్సారావుపేటలో వివాహం ఉండగా మూడు సూట్‌కేసులతో సోమవారం రాత్రి ఎల్‌బీనగర్ రింగురోడ్డు వద్ద బస్సు ఎక్కేందుకు వచ్చాడు. అందులో దాదాపు రూ.60వేల విలువైన ఆభరణాలు ఉన్న సూట్ కేసును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు మంగళవారం ఉదయం ఎల్‌బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement