మలక్‌పేటలో ఎక్సైజ్ దాడులు | Excise attacks in malakpeta | Sakshi
Sakshi News home page

మలక్‌పేటలో ఎక్సైజ్ దాడులు

Oct 14 2015 6:17 PM | Updated on Jul 11 2019 8:43 PM

మలక్‌పేట నియోజకవర్గంలో హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.

మలక్‌పేట నియోజకవర్గంలోని సైదాబాద్, సింగరేణి కాలనీ, ఖాజాబాగ్, చింతల్ తదితర ప్రాంతాలలో బుధవారం ఉదయం హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.ఎం.ఫరూక్ ఆధ్వర్యంలో అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.

13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1,352 గుడుంబా ప్యాకెట్లు, 130 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురిని రిమాండ్‌కు తరలించారు. మిగతా వారిని  బైండోవర్ చేసి వదిలిపెట్టినట్టు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement