మొదటి ఆదివారం అదే పరిస్థితి | Demonetisation effect, Long queue outside ATMs | Sakshi
Sakshi News home page

మొదటి ఆదివారం అదే పరిస్థితి

Dec 4 2016 12:30 PM | Updated on Sep 4 2017 9:54 PM

మొదటి ఆదివారం అదే పరిస్థితి

మొదటి ఆదివారం అదే పరిస్థితి

పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. జీతం డబ్బులు ఖాతాల్లో జమ అయినా.. వాటిని తీసుకోలేని పరిస్థితి ఉద్యోగులది. దీంతో డిసెంబర్‌ నెల మొదటి ఆదివారం కూడా సామాన్య ప్రజలు ఎలాంటి ఖర్చులకు వెళ్లకుండా ఉండటం కనిపిస్తోంది. మార్కెట్‌లో చికెన్, మటన్‌ షాపులు వెలవెలబోతున్నాయి. మరోవైపు డబ్బుకోసం ఏటీఎంలకు వెళ్తున్న ప్రజలను అక్కడి నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే డబ్బులున్న ఏటీఎంలు కనిపిస్తున్నా.. అక్కడ భారీ క్యూ లైన్లలోనే సెలవుదిన సమయం గడిచిపోతుంది.

క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం అంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 80 శాతం ఏటీఎంలను కొత్త నోట్లకు అనుగుణంగా మార్చామని అధికారులు చెబుతున్నా.. ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement