ఘనంగా దుర్గామాత నిమజ్జనం | dasara clebratations | Sakshi
Sakshi News home page

ఘనంగా దుర్గామాత నిమజ్జనం

Oct 24 2015 12:41 AM | Updated on Sep 29 2018 5:52 PM

ఘనంగా దుర్గామాత నిమజ్జనం - Sakshi

ఘనంగా దుర్గామాత నిమజ్జనం

దసరా నవరాత్రుల ముగింపు సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాత ....

ఖైరతాబాద్: దసరా నవరాత్రుల ముగింపు సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాత విగ్రహాలను శుక్రవారం సాయంత్రం నిమజ్జనానికి తరలించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన 8 ప్రత్యేక క్రేన్ల సాయంతో నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. ఒక్క సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 40 దుర్గామాత విగ్రహాలు ఉన్నాయని ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ తెలిపారు.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సుమారు 700 విగ్రహాలు నిమజ్జనమయ్యే అవకాశముందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. శనివారం అదనంగా మరో క్రేన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం కొంతమంది నిమజ్జనానికి అమ్మవారి విగ్రహాలను తరలించకపోవడంతో శనివారం పూర్తి స్థాయిలో తరలివచ్చే అవకాశముందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement