భార్యను వదిలి..మరొకరితో పెళ్లి | Constable second marriage in Hyderabad | Sakshi
Sakshi News home page

భార్యను వదిలి..మరొకరితో పెళ్లి

Jun 24 2016 2:01 PM | Updated on Mar 19 2019 5:52 PM

ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని కొడుకు పుట్టాక.. మరొకరిని మనువాడిన కానిస్టేబుల్ ఉదంతమిది.

- ప్రేమ పేరుతో వంచించిన కానిస్టేబుల్

హైదరాబాద్

 ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకుని కొడుకు పుట్టాక.. మరొకరిని మనువాడిన కానిస్టేబుల్ ఉదంతమిది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధి మూసాపేట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలివీ... 2011 సంవత్సరంలో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆనంద్‌గౌడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. ఆ సమయంలో అతడికి అనిత అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వారు 2013 మే 14వ తేదీన మూసాపేట్ రిజిస్ట్రార్ ఆఫీసులో వివాహం చేసుకున్నారు. వారికి ఒక కొడుకు శ్రీహరి బాబు పుట్టాడు. అనంతరం వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయిన ఆనంద్‌గౌడ్ అక్కడ మరో యువతిని పెళ్లి చేసుకుని, అనితను పట్టించుకోవటం మానేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement