సినీ సహాయ దర్శకుడిపై కేసు | cheating case against cine associate director | Sakshi
Sakshi News home page

సినీ సహాయ దర్శకుడిపై కేసు

Jul 31 2015 8:10 PM | Updated on Aug 13 2018 4:19 PM

సినీ సహాయ దర్శకుడిపై కేసు - Sakshi

సినీ సహాయ దర్శకుడిపై కేసు

సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి నమ్మిస్తూ సర్వం ఊడ్చుకెళ్లాడని సినీ సహాయ దర్శకుడిపై ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ : సహజీవనం చేస్తూ పెళ్లి చేసుకుంటానని ఏడాది నుంచి నమ్మిస్తూ సర్వం ఊడ్చుకెళ్లాడని సినీ సహాయ దర్శకుడిపై ఓ యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే...

గుంటూరు జిల్లా అచ్చంపేట మదిపాడు అగ్రహారం మండలం గింజుపల్లి గ్రామానికి చెందిన వల్లపునేని కృష్ణారావు(27) సినీ సహాయ దర్శకుడిగా పని చేస్తూనే ఈవెంట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈవెంట్లలో పరిచయం అయిన రోజా అనే యువతితో ప్రేమలో పడి ఏడాది కాలంగా శ్రీకృష్ణానగర్‌లో సహజీవనం చేస్తున్నాడు. రెండు నెలలుగా కృష్ణారావు ప్రవర్తనలో మార్పు వచ్చింది. డ్రగ్స్‌కు అలవాటు పడటమే కాకుండా రోజాకు కూడా రోజూ డ్రగ్స్ ఇచ్చి శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడు. 

పీకలదాకా మద్యం తాగిస్తూ, సిగరెట్ పీకలతో కాలుస్తూ, పళ్లతో రక్కుతూ హింసిస్తున్నాడు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, లక్ష రూపాయలు తీసుకొని ఉడాయించా డు. దీంతో బాధితురాలు కృష్ణారావుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన దగ్గర తీసుకున్న డబ్బుతో కృష్ణారావు మరో నలుగురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకొని జల్సాలు చేస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement