పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు | cbi raids in hyderabd post offices | Sakshi
Sakshi News home page

పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు

Nov 24 2016 2:50 PM | Updated on Sep 22 2018 7:57 PM

పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు - Sakshi

పోస్టాఫీసుల్లో సీబీఐ మెరుపు దాడులు

నగరంలోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు.

హైదరాబాద్ : నగరంలోని పలు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులకు దిగారు. పెద్ద నోట్ల మార్పిడితో పోస్టాఫీసులలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ తనిఖీల్లో నారాయణగూడ పోస్టాఫీసులో రూ.40లక్షలు పట్టుబడ్డాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నెల 8 నుంచి పోస్టాఫీసులలో జరిగిన లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్లో భారీగా బ్లాక్మనీ డిపాజిట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం పది పోస్టాఫీసుల్లో సీబీఐ దాడులు కొనసాగుతున్నాయి. దాడులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement