ఇది చేతగాని ప్రభుత్వం : నాగం | bjp leader nagam fires on trs government | Sakshi
Sakshi News home page

ఇది చేతగాని ప్రభుత్వం : నాగం

Dec 11 2015 1:39 PM | Updated on Mar 29 2019 9:07 PM

ఇది చేతగాని ప్రభుత్వం : నాగం - Sakshi

ఇది చేతగాని ప్రభుత్వం : నాగం

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్లో సగం నిధులు ఖర్చు చేయలేని చేతగాని ప్రభుత్వమని దుయ్యబెట్టారు. బడ్జెట్లో మిగిలిన రూ.25 వేల కోట్లు ఏమి చేశారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు.

గ్రేటర్ ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపనతో ప్రజలను మభ్యపెడుతున్నారని నాగం ఆరోపించారు. ప్రభుత్వ హోర్డింగ్లలో టీఆర్ఎస్ కారు గుర్తు ఎందుకు వాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ పరిధిలో నల్లా బిల్లులు, ఇంటి పన్నుల తాయిలాలెందుకు ప్రకటిస్తున్నారో చెప్పాలని.. ఇది అవినీతి కాదా నాగం సూటిగా ప్రశ్నించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement