రేపు బాబుతో జగ్గీ వాసుదేవన్ భేటీ | AP CM meets isha foundation jaggi vasudev on tomorrow at hyderabad | Sakshi
Sakshi News home page

రేపు బాబుతో జగ్గీ వాసుదేవన్ భేటీ

Mar 26 2016 7:18 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవన్ ఆదివారం భేటీ కానున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవన్ ఆదివారం భేటీ కానున్నారు. మదీనగూడలోని చంద్రబాబు ఫాంహౌస్‌లో ఆయన కలుస్తారు. ఈ భేటీలో చంద్రబాబు కుటుంబసభ్యులు కూడా పాల్గొంటారు.

జగ్గీ వాసుదేవ్ గతంలో ఏపీ మంత్రులు, అధికారులకు యోగాలో శిక్షణనిచ్చారు. ఆ తర్వాత ఆయన సంస్థలు ఏర్పాటు చేసేందుకు కృష్ణా జిల్లాలో 400 ఎకరాల భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై అప్పట్లో రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలపడంతో ప్రభుత్వం వెనక్కితగ్గిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement