మారణకాండతోనే మోదీకి ప్రధాని పదవి | Akbaruddin OWAISI fire on pm modi | Sakshi
Sakshi News home page

మారణకాండతోనే మోదీకి ప్రధాని పదవి

Jan 26 2016 3:01 AM | Updated on Aug 15 2018 2:20 PM

మారణకాండతోనే మోదీకి ప్రధాని పదవి - Sakshi

మారణకాండతోనే మోదీకి ప్రధాని పదవి

గుజరాత్, మురదాబాద్‌లలో జరిగిన మా రణకాండతోనే నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి అయ్యారని ఎంఐఎం పార్టీ .....

భోలక్‌పూర్ రోడ్ షోలో అక్బరుద్దీన్ ఒవైసీ
 
కవాడిగూడ: గుజరాత్, మురదాబాద్‌లలో జరిగిన మా రణకాండతోనే నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి అయ్యారని ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 65 ఏళ్లలో ముస్లింలకు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీని  ప్రశ్నించారు. భోలక్‌పూర్ డివిజన్‌లో ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేస్తున్న మహ్మద్ అఖిల్ అహ్మద్‌కు మద్దతుగా అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అమీర్‌ఖాన్‌ల కంటే మోదీ పెద్ద నటుడని వ్యాఖ్యానించారు. ఎంఐఎం అభ్యర్థిని గెలిపిస్తే సాలారేమిల్లత్‌లో మాది రిగా ఈ ప్రాంతీయులకు ప్రత్యేక ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు సయ్యద్ ఫర్హాన్ సజ్దాద్, షరీఫుద్దీన్, సయ్యద్ మొహినుద్దీన్, జునైద్ బాగ్దాద్, కలీమ్, ఫర్వేజ్, ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement