బాలుడి కిడ్నాప్ కలకలం.. నిందితుడి అరెస్ట్ | accuuced in kid kidnap incident arrested | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్ కలకలం.. నిందితుడి అరెస్ట్

Jul 26 2015 7:14 PM | Updated on Oct 4 2018 8:29 PM

బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని నగర పోలీసులు పట్టుకున్నారు.

బోయినపల్లి: బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని నగర పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం బోయినపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్‌లో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. బేగంపేటలో శనివారం సాయంత్రం స్కూలుకు వెళ్లి వస్తున్న వంశీకృష్ణ(12)ను గుర్తుతెలియని దుండగుడు కిడ్నాప్ చేశాడు. కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బోయినపల్లి బాపూజీనగర్ ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలుడు క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement