అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య | A man committed suicide by jumping from apartment | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

Jun 6 2016 11:58 AM | Updated on Nov 6 2018 7:56 PM

అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఉప్పల్‌లో సోమవారం వెలుగుచూసింది.

హైదరాబాద్: అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని ఉప్పల్‌లో సోమవారం వెలుగుచూసింది. ఉప్పల్ ఆదర్శనగర్‌లోని జయధీర్ అపార్ట్‌మెంట్ 5వ అంతస్థులో ఉండే తన అన్న నివాసానికి వచ్చిన ప్రభాకర్‌రెడ్డి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement