1200 మంది విద్యుత్ ఉద్యోగులకు ఊరట | 1200 transco employees get relief in high court | Sakshi
Sakshi News home page

1200 మంది విద్యుత్ ఉద్యోగులకు ఊరట

Jul 13 2015 5:26 PM | Updated on Aug 31 2018 8:24 PM

1200 మంది విద్యుత్ ఉద్యోగులకు ఊరట - Sakshi

1200 మంది విద్యుత్ ఉద్యోగులకు ఊరట

తెలంగాణ ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది.

తెలంగాణ ట్రాన్స్కోలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ ఉద్యోగుల రిలీవింగ్ వివాదంపై హైకోర్టులో సోమవారం విచారణ సాగింది. ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేయడంపై ఉన్న స్టేను ఎత్తేయాలంటూ తెలంగాణ ట్రాన్స్కో హైకోర్టును ఆశ్రయించింది.

అయితే, గతంలో ఆంధ్రప్రదేశ్కు పంపిన 1200 మంది విద్యుత్ ఉద్యోగులకు జీతాలను తెలంగాణ ట్రాన్స్కోయే చెల్లించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement