మద్యం దుకాణదారుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.
మద్యం దుకాణదారుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. నాచారంలోని సాయిరాం వైన్స్ వద్దకు సోమవారం రాత్రి ఓ వ్యక్తి మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చాడు. అతనితో గొడవకు దిగిన దుకాణం సిబ్బంది...దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.తీవ్ర రక్తస్రావం కావటంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ మద్యం దుకాణం యాజమాన్యం బెదిరిస్తోందంటూ బాధితుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.