స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం | School bus missed a mortal danger | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Feb 15 2016 2:27 PM | Updated on Sep 3 2017 5:42 PM

ఖమ్మం జిల్లా జూలూరుపాడులో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది.

ఖమ్మం జిల్లా జూలూరుపాడులో సోమవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూల్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు కొంచెం దెబ్బతినగా.. బస్సులో ఉన్న ఆరుగురు విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. కొత్తగూడెం శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌కు చెందిన బస్సును డ్రైవర్ రాకపోవడంతో క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

దీనిపై విద్యార్థులు తల్లిదండ్రులు మహంకాళి కృష్ణ, వందనపు రామారావు, పెండ్యాల నగేశ్, నరసింహారావు సహా పది మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్కూల్ బస్సును స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement