చెప్పులతో కొట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు | councilers attack in council meeting | Sakshi
Sakshi News home page

చెప్పులతో కొట్టుకున్న మున్సిపల్ కౌన్సిలర్లు

Nov 23 2015 1:40 PM | Updated on Oct 16 2018 6:33 PM

మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఇద్దరు కౌన్సిలర్లు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు.

తాండూరు: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వేదికగా ఇద్దరు కౌన్సిలర్లు పరస్పరం చెప్పులతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సోమవారం చోటు చేసుకుంది. ఎంఐఎం పార్టీకి చెందిన కౌన్సిలర్లు సోఫియా, ఫసియుద్దీన్ లకు గత కొంతకాలంగా వ్యక్తిగత గొడవలు ఉన్నాయి. ఈ రోజు జరిగిన కౌన్సిల్ సమావేశానికి వారు ఇరువురు హజరయ్యారు.

సమావేశంలో సర్వే  నెంబరు 128 స్థల వివాదంలో ఒకరిని ఒకరు దూషించుకోవడంతో ఆగ్రహానికి గురై చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. వెంటనే స్పందించిన తోటి కౌన్సిలర్లు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా గొడవ సద్దుమనగలేదు. కాగా, చైర్ పర్సన్ తీసుకున్న నిర్ణయాలను వైస్ చైర్ పర్సన్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు తప్పుపట్టడంతో సమావేశం వాయిదా పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement