లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బాలకృష్ణ | Balakrishna caught taking bribe | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బాలకృష్ణ

Mar 1 2016 4:54 PM | Updated on Aug 29 2018 1:59 PM

అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది.

అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. విశాఖపట్నం కలెక్టరేట్‌లోని అర్బన్ లాండ్ సీలింగ్ విభాగంలో స్పెషల్ సర్వేయర్ గా  పనిచేస్తున్న బాలకృష్ణ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు.

మర్రిపాలెంలోని హుస్సేన్ నగర్‌కు చెందిన షేక్‌హుస్సేన్ భవన నిర్మాణానికి ఎన్ ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేందుకు లక్షన్నర డిమాండ్ చేయగా, రూ. 50వేలకు బేరం కుదుర్చుకున్నారు. హుస్సేన్ ఇచ్చిన ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని బాలకృష్ణను పట్టుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement