యూత్‌ క్రష్‌

Rashmika Mandanna Full Craze in Youth - Sakshi

రష్మిక మందన్న. సౌతిండియన్‌ సినీ పరిశ్రమలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్‌. తెలుగు, కన్నడ సినీ పరిశ్రమల్లో సూపర్‌హిట్‌ సినిమాలతో దూసుకుపోతోన్న ఈ స్టార్‌కు ముఖ్యంగా యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ ఉంది. తెలుగు సినిమాకు పరిచయం కాకముందు రష్మికకు ‘కర్ణాటక క్రష్‌’ అనే పేరుంది. ఇప్పుడైతే ఆమె పాపులారిటీ సౌతిండియా మొత్తం పాకేసింది కాబట్టి, రష్మికను ‘యూత్‌ క్రష్‌’ అని చెప్పేసుకోవచ్చు.  ఈ స్టార్‌ గురించి కొన్ని విశేషాలు... 

చిన్నప్పట్నుంచీ యాక్టివ్‌... 
 రష్మిక సినిమాల్లో ఎంత హుషారుగా కనిపిస్తుందో, నిజజీవితంలోనూ అంతే యాక్టివ్‌! టీనేజ్‌లో ఉన్నప్పట్నుంచే సినిమాలంటే పిచ్చి. అలా పద్దెనిమిదేళ్లకే మోడలింగ్‌లోకి వచ్చి సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందు చాలా కమర్షియల్‌ యాడ్స్‌కు రష్మిక టాప్‌ ప్రయారిటీగా ఉండేది. మోడలింగ్‌లో ఆ క్రేజే ఆమెకు సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. 

కిరాక్‌ ఆఫర్‌ 
2016. కన్నడలో ‘కిర్రిక్‌ పార్టీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అందులో హీరోయిన్‌ పాత్రకు ఒక ఫ్రెష్‌ ఫేస్‌ అయితే బాగుంటుందని నిర్మాతలు అనుకుంటున్న టైమ్‌లో రష్మికను ఒక యాడ్‌లో చూశారు మేకర్స్‌. ఆడిషన్స్‌ చేసి, రష్మికను సెలెక్ట్‌ చేసి, సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కించి, అదే ఏడాది చివరికి రిలీజ్‌ చేశారు. సినిమా పెద్ద హిట్‌. అందులో హీరోయిన్‌ రష్మిక అయితే ఒక్కసారే ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. ‘కర్ణాటక క్రష్‌’ అన్న పేరు సంపాదించుకునేంతగా యూత్‌ మనసు దోచేసుకుంది. 

ఛలో తెలుగు
‘కిర్రిక్‌ పార్టీ’ సక్సెస్‌తో రష్మికకు తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలైంది. అలా వచ్చిందే నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’! ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా చిన్న బడ్జెట్‌ సినిమాల్లో బ్లాక్‌బస్టర్‌. ఈ సక్సెస్‌తో కన్నడ సినిమాలకు కూడా నో చెప్పేంతగా తెలుగులో బిజీ అయిపోయింది రష్మిక. ప్రస్తుతం ఆమె ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘దేవదాస్‌’ సినిమాల్లో హీరోయిన్‌గా కనిపించనుంది. 

రిలేషన్‌షిప్‌ స్టేటస్‌:ఎంగేజ్డ్‌
రష్మిక వయస్సు ఇప్పుడు 22 ఏళ్లు. మామూలుగా అయితే హీరోయిన్‌గా పేరొస్తున్న వాళ్లు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటారు. రష్మిక ఇవేవీ పట్టించుకోకుండా చిన్న వయసులోనే పెళ్లికి రెడీ అయిపోయింది. ‘కిర్రిక్‌ పార్టీ’లో తన కో స్టార్‌ రక్షిత్‌ శెట్టితో గతేడాది రష్మిక ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 

గీత మేడమ్‌! 
‘ఛలో’ సినిమా రిలీజ్‌ అయి హిట్టయ్యాక రష్మిక పాపులర్‌ అయితే, ‘గీత గోవిందం’ అనే సినిమా విడుదల కాకముందే ఇందులో ఆమె చేసిన పాత్ర పాపులర్‌ అయింది. ‘గీతా మేడమ్‌.. గీతా మేడమ్‌..’ అని పిలుస్తూ ట్రైలర్‌లో హంగామా చేస్తోన్న విజయ్‌దేవరకొండ ఈ సినిమాలో హీరో. ఈ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’ పాట గత నెల రోజులుగా ఆన్‌లైన్‌లో బాగా పాపులర్‌ అయిన పాట. ఇందులో గీత మేడమ్‌కు.. అదే రష్మికకు.. ఆమె ఫ్యాన్స్‌ ఇప్పటికే ఫిదా అయిపోయారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top