ఐ లవ్‌ యు మమ్మీ... 

bird loves mummy - Sakshi

బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు.. అది మనుషులకైనా.. పశుపక్ష్యాదులకైనా.. అమ్మ అంతే.. అలాగే ఉంటుంది.. ఇంతకీ విషయమేమిటంటే.. ఇక్కడుందే ఈ బుల్లి బ్లాక్‌ స్కిమ్మర్‌ పక్షి.. పుట్టి రెండ్రోజులే అయింది.. ఇంట్లోని మిగతా పిల్లలు దీని కన్నా పెద్దవి.. దీంతో అమ్మ రోజూ తెచ్చి పెడుతున్న చేప ముక్కలను దీని దగ్గర్నుంచి లాగేసుకుని.. అవే తినేస్తున్నాయి. పెద్దవి కావడంతో దాదాగిరి కూడా చేస్తున్నాయి.. చాలా చిన్నది కదా.. మరి అమ్మకెలా చెప్పడం.. ఆకలి ఎలా తీర్చుకోవడం.. అయితే.. బిడ్డ ఆకలి గురించి అమ్మకు ఎవరైనా చెప్పాలా.. అమ్మ ఓ కంట కనిపెడుతూనే ఉంది.

అందుకే ఈ రోజు చేప ముక్క తెచ్చి.. మిగతావాటికి పెట్టకుండా.. ముందుగా దీనికే పెట్టింది.. అంతే.. అమ్మకు.. ఐ లవ్‌ యూ చెప్పాలనుకుందో.. థాంక్యూ అనాలనుకుందో తెలియదు గానీ.. ఇలా వెంటనే వచ్చి.. తల్లిని వాటేసుకుంది.. ఈ చిత్రాన్ని ఫ్లోరిడాకు చెందిన వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ థామస్‌ చాడ్విక్‌ తీశారు. ఆయన కొన్ని రోజులుగా ఓ బ్లాక్‌ స్కిమ్మర్‌ బర్డ్‌ కుటుంబాన్ని గమనిస్తూ ఉన్నారట. తల్లి పక్షి.. చేప ముక్క ముందుగా దీనికి పెట్టగానే.. వెంటనే అదిలా ప్రతిస్పందించిందని ఆయన తెలిపారు. 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top