స్త్రీలోక సంచారం

Womens empowerment:Stand Up Yourself - Sakshi

 న్యూయార్క్‌లోని బుష్‌విక్‌ ప్రాంతంలో ఉన్న ‘హౌస్‌ ఆఫ్‌ ఎస్‌’ అనే పబ్‌కు వెళ్లిన ఓహియోలోని భారతీయ సంతతి అమెరికన్‌ యువతి అంకితా మిశ్రా.. పబ్‌లోని టాయ్‌లెట్స్‌ గుదుల గోడలపై ఉన్న హిందూ దేవతల చిత్రాలను చూసి దిగ్భ్రాంతి చెందారు. ‘‘గత నెలలో ఫ్రెండ్స్‌తో కలిసి ‘హౌస్‌ ఆఫ్‌ ఎస్‌’లో నౌట్‌ ఔట్‌కి వెళ్లాను. ఆ పబ్‌లోని వి.ఐ.పి.ల బాత్రూమ్‌కి వెళ్లినపుపడు.. లోపలి గోడలపై కాళీ మాత, సరస్వతి, శివుడు, విఘ్నేశ్వరుల బొమ్మలు కనిపించాయి. షాక్‌ తిన్నాను’’ అని ఆనాటి తన అనుభవాన్ని చెబుతూ.. పబ్‌ యాజమాన్యానికి హైందవ సంస్కృతి గొప్పతనాన్ని వివరించడంతో పాటు.. ఇతర మతస్థుల మనోభావాలను కించపరచడం నాగరికత అని గానీ, కళ అని గానీ అనిపించుకోదు’’ అంటూ అంకిత పెద్ద మెయిల్‌ పెట్టారు. 

‘స్టాండప్‌ యువర్‌సెల్ఫ్‌’ అనే క్యాంపెయిన్‌తో మహిళలకు  దేశవ్యాప్తంగా ఒక లక్ష ‘స్టాండ్‌ అండ్‌ పీ’ (నిలుచుని మూత్రవిసర్జన చేయడానికి అనువైన) సాధనాల ఉచిత పంపిణీ.. వరల్డ్‌ టాయ్‌లెట్‌ డే సందర్భంగా నవంబర్‌ 19న మొదలైంది. మురికిగా ఉండే పబ్లిక్‌ టాయ్‌లెట్‌లో మూత్రవిసర్జనకు అవస్థలు పడుతూ ‘కూర్చోవడం’ నుంచి విముక్తి కల్పిస్తూ, ఢిల్లీ ఐ.ఐ.టి. విద్యార్థులు కనిపెట్టిన శాన్ఫీ (శానిటేషన్‌ ఫర్‌ ఫిమేల్‌) అనే ఈ అట్టముక్క సాధనంతో మహిళలు నిలుచునే మూత్ర విసర్జన చేయవచ్చు. త్వరలోనే మార్కెట్‌లోకి రానున్న ఈ శాన్ఫీలు ఒక్కోటి పది రూపాయలకే లభ్యం అవుతాయట. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top