తులసీదళం... ముఖ సౌందర్యం...

తులసీదళం... ముఖ సౌందర్యం...


* గులాబి రేకుల్లా మృదువుగా ఉండాల్సిన ముఖం మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలతో నిండిపోయిందా? అయితే వాటిని దూరం చేసే ఔషధం మీ పెరట్లోనే ఉంది.  10-15 తులసి ఆకులను పేస్ట్‌లా చేసి, దాన్ని టమాటో గుజ్జుతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అలా ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

*ఈ వర్షాకాలంలో వానకు తడిసీ తడిసీ జుట్టు తన సౌందర్యాన్ని కోల్పోతుంది. అలా కాకుండా కురులు నిగనిగలాడాలంటే తలంటు స్నానం చేసిన ప్రతిసారి రెండు టీ స్పూన్ల (శనగ పిండి), ఒక గుడ్డు తెల్ల సొన, ఒక టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ నిమ్మరసం తీసుకొని వాటన్నింటిని కలపాలి.ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. రెండు వారాల్లో కనీసం ఇలా నాలుగుసార్లు చేస్తే మేనితో సమానంగా మెరిసే కురులు మీ సొంతం.

* చేతులు, పాదాల చర్మకాంతి పెరగాలంటే... మూడు స్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు స్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్ వాటర్‌ను బాగా కలిపాలి. దాన్ని కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే అది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది.

* ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసాన్ని తాగితే అది ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు ఆ రసాన్ని మాడుకు రాసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగడంతో చుండ్రు మాయమవుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top