గర్వంగా గౌను

గర్వంగా గౌను


గౌను మనది కాదు... మనదైపోయింది... ప్రపంచంలో గౌన్లు ధరించిన మహిళలు గద్దెనెక్కి కూర్చున్నారు... శాసించారు. రాణించారు. మహారాణులనిపించుకున్నారు. ‘వలెంటినో గరవాని’ డిజైన్‌ చేసిన గౌన్లకి ఆడంబరాల వెలుగు ఎంతుంటుందో వాటిని ధరిస్తే గర్వంగా తలెత్తుకునే హంగూ అంతలా ఉంటుంది.



మెత్తటి సిల్క్‌ లేదంటే పువ్వులా ఆకర్షించే షిఫాన్‌ అదీ కాదంటే మృదువుగా మనసును తట్టే లేస్‌.. ఫ్యాబ్రిక్‌ వాలెంటినో చేతిలో పడిందంటే అది అమ్మాయి మేనిపై కొత్తగా హొయలు పోవాల్సిందే! అంత అందంగా ఉంటాయి కాబట్టి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన పదిమంది ఫ్యాషన్‌ డిజైనర్లలో ఒకరిగా నిలబెట్టింది. పేరు ‘వలెంటినో గరవాని.’ ఇటలీ ఫ్యాషన్‌ డిజైనర్‌. పెరిగింది, చదివింది మాత్రం ఫ్యాషన్‌ ప్రపంచానికి పుట్టినిల్లు అయిన ప్యారిస్‌లో. డిజైన్లలో విభిన్నతను మాత్రమే కాదు అందాన్నీ చూడాలని కోరుకునే సృజన వలెంటినోది. సొంతగడ్డకు వచ్చి తన పేరుతోనే ఫ్యాషన్‌ హౌజ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అయినా, ప్యారిస్, లండన్, న్యూయార్క్‌ వంటి మహానగరాలలో ఫ్యాషన్‌ షోలలో హైలైట్‌గా నిలిచాడు. అప్పటి వరకు  ఆధునికపు మోజులో కొట్టుకుపోతున్న డిజైన్స్‌లో స్త్రీని స్త్రీగా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు.





దీంతో ప్రపంచ ఫ్యాషన్‌ స్టైలిస్ట్‌లు వలెంటినో డిజైన్స్‌కి దాసోహం అన్నారు. అందుకే అత్యంత ప్రఖ్యాతి చెందిన బ్రాండ్లలో ‘వలెంటినో’ ఒకటిగా చేరింది. వలెంటినో డిజైన్లు రొమాంటిక్‌గా నిలవడం స్పెషల్‌ బ్రాండ్‌ అయ్యింది. మెత్తని లేసులు, ఖరీదైన షిఫాన్స్, మృదువైన సిల్క్, శాటిన్‌ క్లాత్‌లపై తన సృజనాత్మకత విరివిగా చూపించాడు. ఆధునిక మహిళ ఎంత అందంగా ఉండాలో చూపించాడు. చాలామంది డిజైనర్లు వలెంటినోను అనుకరించారు. ఇలాంటి డిజైన్లు రూపుకట్టడానికి ప్రపంచవ్యాప్త పోటీ ఎప్పుడూ ఉంటుంది. అది హాలీవుడ్‌ అయినా మన బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ అయినా వలెంటినో డిజైన్‌ డ్రెస్‌ ధరిస్తే అందంగా వెలిగిపోవడం ఖాయం అనుకుంటారు. విల్లులా, పువ్వులా, ముడతలుగా, లేస్‌గా, ఎంబ్రాయిడరీగా.. నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో వలెంటినో స్టైల్‌గా ఇలా హొయలు పోతుంది.



ఎన్నెన్నో గౌన్లు

►ట్రాపికల్‌ డ్రీమ్, ఈవెనింగ్‌ స్పెషల్, క్రేప్‌ మినీ, లేస్‌ మిడ్, తుల్, ఎంబ్రాయిడరీ, ఫ్లోరల్‌ ప్రింట్, హాఫ్‌ షోల్డర్‌.. ఇలా గౌన్లలో వేటికది భిన్నం. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ చేయడంలో వలెంటినో గరవాని శైలి ఘనం.



►క్లాత్‌లోనే కాదు ప్రింట్ల ఎంపికలోనూ గరవాని òస్టైల్‌ భిన్నంగా ఉంటుంది. ధరించేవారిని న్యూలుక్‌తో చూపుతుంది.



►కాన్వాస్‌పై ఆయిల్‌ పెయింటింగ్‌ ఎలా కళ్లకు కడుతుందో గరవాని గౌన్లను చూస్తే ఆ అనుభూతి కలుగుతుంది. వేడుకలలో ప్రత్యేకంగా నిలుస్తుంది.





ఇతర డిజైన్లూ ఫేమస్‌!

గౌన్లు మాత్రమే కాదు వలెంటినో గరవాని హౌజ్‌లో మరెన్నో డిజైన్స్‌ ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. వాటిలో...



ట్రౌజర్స్‌: పలాజో, క్రాప్డ్‌ వైడ్‌ లెగ్, వెక్చర్డ్‌ వైడ్‌ లెగ్,ఫ్లేయిర్డ్, హై వెయిస్టెడ్‌ పలాజో ప్యాంట్స్‌.. గరవాని ఎంచుకునే ప్రింట్లు క్లాత్‌లు, ఫ్లోయింగ్‌ కట్‌.. మనవారూ అనుకరించేలా ఉంటుంది.



జాకెట్స్‌: గౌన్లు, స్కర్టులే కాదు మిలటరీ జాకెట్స్, బాంబర్‌ జాకెట్స్, ఫర్‌ జిలెట్, బైకర్‌ జాకెట్, లేస్‌ ప్యానెల్‌ కేప్, ఆప్లిక్‌ డెనిమ్‌ జాకెట్‌.. వంటివీ వాలెంటినో స్పెషల్‌ బ్రాండ్లు అనిపించాయి.



డెనిమ్‌ ప్యాంట్స్‌: బాయ్‌ఫ్రెండ్, స్లిమ్‌ ఫిట్, ప్యాచ్‌వర్క్, స్కిన్నీ, క్రాప్డ్, బీడెడ్‌ వైడ్‌ లెగ్, స్ట్రెయిట్‌ లెగ్‌.. ఇలా జీన్స్‌లో వలెంటినో రెడ్‌ లేబుల్‌ వార్డ్‌రోబ్‌లో చేర్చుకుంటే ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ కట్‌ అని ఒప్పుకు తీరుతారు.



► రెడ్‌ కార్పెట్‌ గౌన్‌గా వలెంటినో గరవాని డ్రెస్‌కి ప్రపంపచవ్యాప్త పేరుంది. గ్లామరస్‌గా చూపించే స్టైల్‌ కావడంతో తారలు ముచ్చటపడి ఎంచుకునే డ్రెస్‌లలో గరవాని డిజైన్‌ తప్పక ఉంటుంది.

- వలెంటినో గరవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top