మీ మనసులో ఏముందో చెప్పొచ్చు! | Say what's on your mind! | Sakshi
Sakshi News home page

మీ మనసులో ఏముందో చెప్పొచ్చు!

Jun 9 2014 10:18 PM | Updated on Sep 2 2017 8:33 AM

మీ మనసులో ఏముందో చెప్పొచ్చు!

మీ మనసులో ఏముందో చెప్పొచ్చు!

ఎవరి మనసులో ఏముందో ఎవరికెరుకా?... అని ఇక ముందు మనం పాటలు పాడుకోనక్కర్లేదు.

సాంకేతికం
 
ఎవరి మనసులో ఏముందో ఎవరికెరుకా?... అని ఇక ముందు మనం పాటలు పాడుకోనక్కర్లేదు.
 
ఎందుకంటే మనసులో ఉన్న మాటను కనిపెట్టే సాధనం సమీప భవిష్యత్తులో రాబోతోంది. సైన్స్‌ఫిక్షన్‌లో మాత్రమే కనిపించే మనసులోని భావాలను కనిపెట్టే సాధనం నిజజీవితంలోకి రానుంది.  
 
‘స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’కు చెందిన పరిశోధకులు ‘బ్రెయిన్ చిప్స్’ ద్వారా మెదడును మానిటర్ చేయడానికి అవసరమైన కొత్త విధానాలను కనుగొన్నారు. కొందరు వ్యక్తులను తమ ప్రయోగానికి ఎంచుకొని, గణితానికి, నిత్యజీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. సమాధానాలు చెప్పే క్రమంలో తప్పు, ఒప్పులకు ‘బ్రెయిన్ సెల్స్’ ఎలా ఉత్తేజితం అవుతున్నాయనేది అధ్యయనం చేశారు.
 
‘‘వ్యక్తుల బ్రెయిన్ యాక్టివిటీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అధ్యయం చేయడం ద్వారా వారి మనసులోని మాటను కనిపెట్టడం సులువే’’ అంటున్నాడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటికి చెందిన న్యూరాలజీ ప్రొఫెసర్ జోసెఫ్ పర్విజి. ప్రస్తుతం ఉనికిలో ఉన్న బ్రెయిన్ మానిటరింగ్ టెక్నిక్‌లు వ్యక్తుల ఆలోచనల తాలూకు సంపూర్ణ చిత్రాన్ని ఇవ్వలేకపోతున్నాయి, ఆ లోటును తమ అధ్యయన ఫలితాలు పూరిస్తాయని అంటున్నాడు జోసెఫ్.
 
యూనివర్శిటీ ఆఫ్ ఒరెగాన్(అమెరికా)కు చెందిన పరిశోధకులు కూడా మైండ్ రీడింగ్‌పై రకరకాల పరిశోధనలు చేసి మంచి ఫలితాలు సాధించారు. తాము అభివృద్ధి చేయబోయే టెక్నిక్ వైద్యరంగానికి చాలా మేలు చేస్తుందని పరిశోధక బృందం చెబుతోంది. వీరు కనుగొన్న సాంకేతిక ప్రక్రియకు పేషంట్ల ప్రయివేట్ ఆలోచనలను కూడా పసిగట్టగల సామర్థ్యం ఉంటుందని నిపుణులు అంటున్నారు ‘‘మనిషి అనేవాడు ఒకే సమయంలో ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటాడు. వాటిని కనిపెట్టడం పెద్ద విషయమే’’ అంటున్నాడు పరిశోధక బృందానికి నాయకుడైన ఎడ్వర్డ్ కె వోగెల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement