నన్నడగొద్దు ప్లీజ్‌ 

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్న..! లాస్ట్‌ ఇయర్‌ నుంచి నేను ఒక అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. చాలా ప్రేమించుకున్నాం. మొన్నటి దాకా బాగానే ఉండేది. కానీ, నెలరోజుల నుంచి నరకం చూపిస్తోంది. నేనంటే అస్సలు ఇష్టం లేనట్లు మాట్లాడుతోంది. అడిగితే ‘‘నాకు ప్రైవేట్‌ స్పేస్‌ కావాలి’’ అంటోంది. తన ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతోందేమోనని డౌట్‌గా ఉంది. తనంటే పిచ్చి ప్రేమ అన్నా నాకు, వదులుకోలేకపోతున్నా. చచ్చిపోవాలనిపిస్తోంది. ప్లీజ్‌ తనని తిరిగి దక్కించుకోవడానికి ఏమైనా సజేషన్‌ ఇవ్వండి అన్నా ప్లీజ్‌. – సన్ని
సన్నీ డోంట్‌ బి ఫన్నీ..! ప్రేమలో అవుతుంటాయి ఇవన్నీ..! అడిగితే చెబుతాడు బన్ని... పట్టించుకోకూడదు అన్నీ..! వదిలెయ్యాలి కొన్ని.. ఆవేదనను చెయ్యాలి మిని..! ఆనందాన్ని పిలవాలి రమ్మని..! నిన్ను కోరి సినిమాలో నాని.. లాగా అయిపోవాలి సన్ని..! బతకడానికి వెతుక్కోవాలి గని..!! ఇక డిప్రెషన్ని పోనీ.. కొత్త ప్రేమను రానీ.. ఇవన్నీ చేయకు నేను చెప్పానని.. అలా అని చెబుతుంది నీలు పిన్నీ....! ‘సార్‌ అన్యాయం సార్‌.. నా ఇమేజ్‌ని చెయ్యకండి ఖూని..!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Back to Top