గోంగూర పులిహోర

గోంగూర పులిహోర


కుకింగ్‌తయారి సమయం: 45 నిమిషాలు

కావలసినవి: గోంగూర ఆకులు – రెండు కప్పులు బియ్యం – 2 కప్పులు (వండి చల్లార్చుకోవాలి) పసుపు – అర టీ స్పూన్‌ కరివేపాకు – రెండు రెబ్బలు ఉప్పు – రుచికి సరిపడినంత వేరుశెనగ గుళ్లు – 2 టేబుల్‌ స్పూన్లు ఆవాలు – టీ స్పూన్, మెంతులు – అర టీ స్పూన్‌ ఎండుమిర్చి – 3, నూనె – 3 టేబుల్‌ స్పూన్లుపోపు కోసం: శనగపప్పు – టేబుల్‌ స్పూన్, మినప్పప్పు – టేబుల్‌ స్పూన్, ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి – 2, పచ్చిమిర్చి – 4, ఇంగువ – పావు టీ స్పూన్, పల్లీలు – గుప్పెడు,తయారి:   పాత్రలో టీ స్పూన్‌ నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేయించి దింపి చల్లార్చాలి అర టేబుల్‌ స్పూన్‌ నూనె వేడి చేసి గోంగూర వేసి పచ్చివాసన పోయేలా 8 నిమిషాల పాటు వేయించి దింపేసి చల్లార్చాలి ముందుగా వేయించిన దినుసులు గ్రైండ్‌ చేసిన తర్వాత గోంగూర వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి. (నీరు కలపకూడదు) పాత్రలో మిగతా నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాక, పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి వేసి అర నిమిషం పాటు వేయించాలి. శనగపప్పు, వేరుశెనగ గుళ్లు, మినప్పప్పు వేసి రెండు నిమిషాలు వేయించాక, ఇంగువ, కరివేపాకు వేసి నిమిషం వేయించి దింపేయాలి చల్లారిన అన్నంలో ముందుగా గోంగూర పేస్ట్‌ వేసి కలపాలి. తర్వాత చల్లార్చిన పోపు, ఉప్పు వేసి కలపాలి అప్పడం కాంబినేషన్‌తో అందిస్తే రుచిగా ఉంటుంది.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top