నీలోకి నీవు తొంగి చూసుకో! 

always try to have long-term spells for all who are prudent - Sakshi

చెట్టు నీడ

వివేకజ్ఞానం కలిగిన వారెప్పుడూ దీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. భగవంతుడిని నమ్మేవారు వారు  ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక  సుఖాన్ని లెక్కించక స్వర్గలోకం  పొందబోయే సుఖం కోసమే  ప్రయత్నిస్తారు.

పూర్వం మహాభారత యుద్ధ సందర్భంలో అర్జునుడు యుద్ధం పాపానికీ, దుఃఖానికీ కారణమైనని భావించి, ఆయుధాలను పక్కన పడవేసి, నిర్వేదంలో కూరుకుపోయి ఉన్నప్పుడ శ్రీ కృష్ణ పరమాత్మ ధర్మయుద్ధం క్షత్రియులకు పూర్వపుణ్యం వల్లనే దొరుకుతుందని, అది రాబోయే మహాపుణ్యానికి సాధనా మార్గమని, అదే మహాసుఖానికీ, ఆనందానికీ కారణమని తెలిపాడు. ఇక్కడ కృష్ణపరమాత్మ అర్జునుడిని యుద్ధంచేయమని బలవంతం చేయలేదు, కేవలం యుద్ధం ఎందుకు చేయాలో చెప్పాడంతే! దాంతో అర్జునుడికి దుఃఖనివృత్తి జరిగి, యుద్ధం వైపు మనసు మళ్లింది. అంటే దుఃఖాన్ని తొలగించుకోవడం వల్ల ఆనందం కలుగుతుందన్నమాట. 

లోకంలో ప్రజలు కోరే ధనం, ధాన్యం, ఇల్లు–వాకిలి, విద్య, అధికారం, కీర్తి, మర్యాద, పుణ్యం, బంధువర్గం మొదలైనవన్నీ తమ తమ సుఖానికి లేదా ఆనందాన్ని పొందడం కోసమేనని భావిస్తారు. ఎందుకంటే, ఆనందాన్ని కలిగించేది సుఖం మాత్రమే, సుఖాన్ని చేకూర్చేది ఆనందం మాత్రమే. వేదాలు, ఉపనిషత్తులూ ఏమి చెబుతాయంటే, అవివేకులైన వారు మాత్రమే తాత్కాలిక ఆనందాన్ని, సుఖాన్ని కోరుకుంటారు. వివేకజ్ఞానం కలిగిన వారెప్పుడూ దీర్ఘకాలిక సుఖానికై ప్రయత్నిస్తారు. భగవంతుడిని నమ్మేవారు వారు ఎప్పుడూ కూడా దీర్ఘకాలిక సుఖాన్ని లెక్కించక స్వర్గలోకం పొందబోయే సుఖం కోసమే ప్రయత్నిస్తారు. గట్టిగా ఆలోచించి చూస్తే, సుఖం లేదా ఆనందం అన్నది శరీరంలోనిదే కానీ శరీరానికి అవతల ఉన్నది కాదు.

సుఖం మాత్రమే తమకు అనుకూలమైనదని భావించినప్పుడు, దానికి ప్రతికూలమైనవన్నీ దుఃఖాలే అవుతాయి. కాబట్టి దుఃఖ పరిహారాన్నీ, ఈ లోకపు అల్పసుఖాన్నీ, శాశ్వత మోక్షసుఖాన్నీ కోరేవారు, దైవానుగ్రహం కోసం కృషి చేయాలనీ, తద్వారానే జీవుల దుఃఖ నివృత్తి అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి భగవంతుణ్ణి నమ్మని వాళ్ల సంగతేమిటనే ప్రశ్న తలెత్తవచ్చు. దానికి యోగశాస్త్ర పితామహుడు పతంజలి ముని ఏమి చెబుతాడంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఆ రోజు చేసిన పనులన్నింటినీ నెమరు వేసుకో. ఆ తర్వాత నీలోకి నీవు తొంగి చూసుకో. నువ్వు ఆలోచించిన కొద్దీ నీ ఆలోచనా పరిధి పెరుగుతుంది. దుఃఖ నివృత్తి జరుగుతుంది. ఆనందం కలుగుతుంది. అలా తనలోకి తాను తరచి చూసుకోవడమే ధ్యానం.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top