వైఎస్‌ఆర్ పాలనలో మైనారిటీల సంక్షేమం | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ పాలనలో మైనారిటీల సంక్షేమం

Published Tue, Mar 25 2014 12:35 AM

ఎస్వీ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్న 9వ వార్డు ప్రజలు - Sakshi

కల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనా కాలంలో మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని 9వ వార్డు బండిమెట్టకు చెందిన ఇమ్రాన్ ఖాన్, అయ్యూబ్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్, మహబూబ్, వలి, నజీర్, చాంద్, జమీల్, అబ్దుల్ సలీమ్, షేక్షా, బాబులతో పాటు మరో 80 మంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అలాగే 20వ వార్డుకు చెందిన యూత్ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్, చందు, నటరాజ్, హరి, మధు, వెంకటేశ్, నాగేంద్ర, వలి, మహేశ్‌తో పాటు మరో 150 మంది స్థానికులు పార్టీ తీర్థ పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందని తెలిపారు. తండ్రిబాటలో నడుస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే సువర్ణ పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement