మిగిలింది ఒక్కరోజే! | tomorrow last day for filing of nominations | Sakshi
Sakshi News home page

మిగిలింది ఒక్కరోజే!

Apr 18 2014 2:26 AM | Updated on Mar 18 2019 7:55 PM

జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది.

విజయనగరం కంటోన్మెంట్/నెల్లిమర్ల, న్యూస్‌లైన్: జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. వాస్తవానికి ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ నేడు(శుక్రవారం) సెలవు కావడం తో శనివారం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. తొమ్మిది నియోజకవర్గాల్లోనూ ఇప్పటికే ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీ పీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. జై సమైక్యాం ధ్ర, బీఎస్పీ. బీజేపీ, లోక్‌సత్తా తదితర పార్టీలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో నామినేషన్లు దా ఖ లు చేయూల్సి ఉంది.

 సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశం ఉండడంతో బీజేపీ తరఫున కూడా అభ్యర్థు లు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కానీ ఈసారి నామినేషన్ల దాఖలకు తక్కువ రో జులు ఉండడంతో అభ్యర్థులు పరుగులు తీయ్సూలి వస్తోంది. ఈనెల 12 నుంచి 19వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ మధ్యలో మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. దీంతో అభ్యర్థులకు కేవలం ఐదు రోజులు మాత్ర మే సమయం ఉంది.తక్కువ రోజులు ఉండడంతో అభ్యర్థులు అఫిడవిట్లకు, బ్యాంకు అకౌంట్లకు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు.

 రాజకీయ అనుభవం ఉన్న వారికి ఈ సమయం సరిపోయినా... కొత్తగా నా మినేషన్ వేసేవారికి, ఇండిపెండెంట్లకు కొ న్ని ఇబ్బందులు ఎదురవుతున్నారుు. వారికి పూర్తి వివరాలు తెలియక, వివరాలు తెలుసుకునేందుకు వెళ్లినా.. అక్కడ సెలవు కారణంగా అధికారులు లేక ఇబ్బందులు ప డుతున్నారు. విజయనగరం పార్లమెంట్ స్థానానికి ఇప్పటివరకూ ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు 12న రెం డు, 15న రెండు, 16 న మూడు నామినేష న్లు దాఖలు కాగా 17న కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. ఒక్కరోజు మా త్రమే గడువు ఉండడంతో అభ్యర్థులు నా మినేషన్ల పత్రాలుసిద్ధం చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement