రామచంద్రపురంలో ‘ఫ్యాన్’కు కలిసొచ్చిన ‘సైకిల్’ కలహాలు | tdp, ysrcp local body elections fight in Ramchandrapuram | Sakshi
Sakshi News home page

రామచంద్రపురంలో ‘ఫ్యాన్’కు కలిసొచ్చిన ‘సైకిల్’ కలహాలు

Mar 31 2014 12:35 AM | Updated on Aug 14 2018 4:21 PM

రామచంద్రపురం బరిలో టీడీపీలో ఒకరి కంటే ఎక్కువ మంది చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకోవడంతో కొన్ని వార్డుల్లో సొంత వారినే ఓడించే పరిస్థితి ఎదురైందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.

 రామచంద్రపురం బరిలో టీడీపీలో ఒకరి కంటే ఎక్కువ మంది చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకోవడంతో కొన్ని వార్డుల్లో సొంత వారినే ఓడించే పరిస్థితి ఎదురైందని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. దీనికి తోడు తమ చైర్మన్ అభ్యర్థి అడ్డూరి పద్మనాభరాజుపై పార్టీ రహితంగా ఉన్న ఆదరణ తమకు కలిసొచ్చిందని వైఎస్సార్ సీపీ నేతలు లెక్కలేస్తున్నారు. 27 వార్డుల్లో తమ ఖాతాలో జమ కానున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురంలలో కూడా సానుకూల పవనాలు వీచాయని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది.
 
 కాగా పెద్దాపురంలో పట్టు సాధించామని టీడీపీ చెబుతోంది. 28 వార్డుల్లో 10 చోట్ల టీడీపీ,  వైఎస్సార్ సీపీల మధ్య హోరాహోరీ పోరు జరగ్గా వాటిలో నాలుగు, మిగిలిన 18లో 13 స్థానాలు తమవేనని  వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది. సామర్లకోటలో 30 వార్డులకు పోరు జరగ్గా, జగన్ రోడ్‌షో నిర్వహించిన వార్డుల్లో మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరడంతో 16 వార్డులు సానుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. అమలాపురం తమదేనని టీడీపీ మొదట్లో ధీమా వ్యక్తం చేసినా పోలింగ్ అనంతరం పరిస్థితిలో మార్పు వచ్చిందంటున్నారు. ఇక్కడ 30 వార్డులకు 15 తమకు వస్తాయని టీడీపీ చెబుతుండగా, బరిలోకి దిగిన 26 వార్డుల్లో 16 చోట్ల తమకు ఆధిక్యం లభిస్తుందని వైఎస్సార్ సీపీ అంచనా వేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement