బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రచారంలోకి వచ్చిన ‘హర్ హర్ మోడీ’ నినాదంపై ద్వారక పీఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై ఆర్‌ఆర్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు తన అభ్యంతరాన్ని తెలిపారు.
అహ్మదాబాద్/ఫరూఖాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ఉద్దేశించి ప్రచారంలోకి వచ్చిన ‘హర్ హర్ మోడీ’ నినాదంపై ద్వారక పీఠం శంకరాచార్య స్వరూపానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని పై ఆర్‌ఆర్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు తన అభ్యంతరాన్ని తెలిపారు. ఇలాంటి వ్యక్తి పూజను నిలిపేయాల్సిందిగా ఆయన్ను కోరారు. హర హర మహాదేవ నినాదాన్ని మోడీ నినాదంగా మార్చడాన్ని స్వరూపానంద తప్పుబట్టారు. ఇది శివుడిని అవమానపర్చడమేనన్నా రు. వీటన్నింటిని భాగవత్‌కు తెలిపానని పీటీఐ వార్తా సంస్థకు స్వరూపానంద చెప్పారు. తన అభ్యంతరంపై భాగవత్ వివరణ ఇచ్చారని, తాము కూడా వ్యక్తిపూజకు వ్యతిరేకమని ఆయన చెప్పారన్నారు.
ఇక ఆ నినాదం వద్దు: మోడీ
ఆ నినాదంపై పీఠాధిపతులు, విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో మోడీ స్పందించారు. తన మద్దతుదారులు భవిష్యత్‌లో ఈ నినాదం చేయవద్దని ట్విట్టర్‌లో కోరారు. పీఠాధిపతుల అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోడీ అన్నారు.