‘ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలక తప్పదు' | NDA gas balloon will burst again, says rahul gandhi | Sakshi
Sakshi News home page

‘ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలక తప్పదు'

Apr 1 2014 11:07 PM | Updated on Mar 29 2019 9:24 PM

‘ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలక తప్పదు' - Sakshi

‘ఎన్డీఏ బెలూన్ మరోసారి పేలక తప్పదు'

ఎన్టీఏ కూటమిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు.

ఔరంగాబాద్: ఎన్టీఏ కూటమిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. గత 2004, 2009 ఎన్నికల్లో మాదిరిగానే ఎన్డీఏ గ్యాస్ బెలూన్ మరోసారి పేలిపోతుందని ఆయన పునరుద్ఘాటించారు. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని, బీజేపీ మాత్రం విభజన రాజకీయాలు చేస్తోందని రాహుల్ మండిపడ్డారు.

 

2004లో ‘భారత్ వెలుగుతోంది’ అంటూ వారు ఊదరగొట్టినా వారి గ్యాస్ బెలూన్ పగిలిపోయిందని, 2009లోనూ అదే జరిగిందన్నారు. ఇప్పుడు కూడా వారు అదే గ్యాస్ బెలూన్‌ను ప్రదర్శిస్తున్నారని, అది కూడా పేలిపోతుందన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement