వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు | Kandula brothers joined into YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు

Apr 26 2014 8:23 PM | Updated on Aug 14 2018 4:21 PM

వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు - Sakshi

వైఎస్ఆర్ సిపిలో చేరిన కందుల సోదరులు

వైఎస్ఆర్ జిల్లాలో పేరున్న సీనియర్ రాజకీయ నాయకులు కందుల సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కడప: వైఎస్ఆర్ జిల్లాలో పేరున్న సీనియర్ రాజకీయ నాయకులు కందుల సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కందుల శివానంద రెడ్డి, అతని సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజమోహన రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి కూడా వైఎస్ఆర్ సిపిలో చేరారు. వీరు పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్ఆర్ సిపి నేతలు వైఎస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు, ఎమ్మెల్యే అభ్యర్ధి అంజద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న కందుల సోదరులు సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో  ఉన్నారు.  కొద్ది కాలం ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మల్లీ కొద్ది కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత నెలలోనే మళ్లీ టిడిపిలో చేరారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో అక్కడ ఇమడలేమనుకున్నారో ఏమో ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో చేరారు.

కందుల శివానందరెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.1981 నుంచి 1986 వరకు శాసనమండలి సభ్యులుగా ఉన్నారు.1989లో కాంగ్రెస్‌ పార్టీ తరపున కడప శాసనసభ స్థానంకు పోటీచేసి గెలుపొందారు. ఆ తరువాత కూడా ఆయన మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 1996లో తెలుగుదేశం పార్టీలో చేరి, ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులుగా పనిచేశారు. ఆయన సోదరుడు కందుల రాజమోహన్‌రెడ్డి కూడా పోలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేశారు.  కందుల రాజమోహన రెడ్డి మూడు సార్లు లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2011లో ఉప ఎన్నికల సందర్భంగా కందుల సోదరులిద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement