సత్తాచూపుతాం! | do work as a soldiers | Sakshi
Sakshi News home page

సత్తాచూపుతాం!

Mar 25 2014 2:40 AM | Updated on May 25 2018 9:12 PM

సత్తాచూపుతాం! - Sakshi

సత్తాచూపుతాం!

పుర ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని, జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో మంచి ఫలితాలను సాధిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు.

బొబ్బిలి, న్యూస్‌లైన్: పుర ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని, జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో మంచి ఫలితాలను సాధిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు. బొబ్బిలిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.పార్టీకి ఫ్యాన్ గుర్తు వచ్చాక  జరుగుతున్న మొదటి ప్రత్యక్ష  ఎన్నికలు ఇవని, అందుకు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని చెప్పారు.

జిల్లాలోని నాలుగు పురపాలక సంఘాల్లో సత్తా చూపుతాం!
 చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.  ఈ నెల 27 జగన్  జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార సమయం ముగిసేలోగా పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో నాలుగు పురపాలక సంఘాల్లో   సభలు ఏర్పాటు చేయనున్నట్టు  చెప్పారు.
 
 నాలుగు రోజులుగా తాను వార్డుల్లో ఇంటింట ప్రచారం చేస్తున్నానని, ఆ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. సాధారణ ఎన్నికల కంటే నెల 15 రోజుల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదని, అయినా నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో జయభేరి మోగిస్తామని చెప్పారు.
 
 తమ పేరు చెప్పుకొని చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు అడుగుతున్నారని తెలిసిందని, దానిని ఎవరూ నమ్మవద్దని,  తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫారంలు ఇచ్చిన తరువాత ఫ్యాను గుర్తును కేటాయించారని,వారికే ఓటు వేయాలని కోరారు. ఈ సమావేశంలో అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గునాన వెంకటరావు, 7వ వార్డు అభ్యర్థి రాంబార్కి శరత్‌కుమార్, మాజీ కౌన్సిలరు బొబ్బాది తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement