రాహుల్ గాంధీ ఓ జోకర్ అన్న కాంగ్రెస్ నేత | Congress leader calls Rahul a joker | Sakshi
Sakshi News home page

రాహుల్ గాంధీ ఓ జోకర్ అన్న కాంగ్రెస్ నేత

May 28 2014 5:10 PM | Updated on Mar 18 2019 9:02 PM

రాహుల్ గాంధీ ఓ జోకర్ అన్న కాంగ్రెస్ నేత - Sakshi

రాహుల్ గాంధీ ఓ జోకర్ అన్న కాంగ్రెస్ నేత

టీ హెచ్ ముస్తఫా అనే సీనియర్ కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఏకంగా జోకర్ అని అన్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీ వ్యవహారం పిచ్చోడిలా ఉందని కూడా అన్నాడు.

'రాహుల్ గాంధీ ఒక జోకర్. ఆయన తనంతట తానుగా పార్టీ పదవులనుంచి తప్పుకోవాలి. లేకపోతే ఆయన్ని బలవంతంగా పంపించేయాలి. ఆయన జోకర్ వ్యవహారం వల్లే కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. ప్రధానమంత్రి పదవి అంటే పిల్లలాట కాదు.'
 
ఈ మాటలన్నది ఏ విపక్ష నేత లేక రాజకీయ విమర్శకుడో కాదు. ఏకంగా ఒక కాంగ్రెస్ నేత. ఆయన కూడా ఆషామాషీ నేత కాదు. కేరళలో మంత్రిగా పనిచేశారు. టీ హెచ్ ముస్తఫా అనే సీనియర్ నేత రాహుల్ గాంధీని ఏకంగా జోకర్ అని అన్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీ వ్యవహారం పిచ్చోడిలా ఉందని కూడా అన్నాడు. 
 
మరి పార్టీని బతికించి, బాగుచేయాలంటే ఏం చేయాలని విలేఖరులు అడిగితే ఆయన ప్రియాంకాగాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదని స్పష్టం చేశారు. 
 
ముస్తఫా మరో అడుగు ముందేసి, భజనపరుల వల్లే రాహుల్ దెబ్బతిన్నారని, రక్షణ మంత్రి ఏ కె ఆంటోనీ కూడా ఆ భజనపరుల్లో ఒకరని అనేశారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ముస్తఫాని విమర్శించే ధైర్యం కూడా చేయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement