1279 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు దాఖలు | 1279 Postal ballots votes are filed | Sakshi
Sakshi News home page

1279 పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు దాఖలు

May 6 2014 1:17 AM | Updated on Oct 8 2018 5:19 PM

జిల్లాలోని 10 అసెంబ్లీ, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1279 ఓట్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: జిల్లాలోని 10 అసెంబ్లీ, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1279 ఓట్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 10 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి 753, ఆయా సెగ్మెంట్ల నుంచి ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభకు సంబంధించి 526 ఓట్లు తమకు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. భద్రాచలం సెగ్మెంట్‌కు 857 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు విడుదల చేయగా శాసనసభకు 45, లోక్‌సభకు 45 ఓట్లు దాఖలయ్యాయన్నారు. అదేవిధంగా పినపాక సెగ్మెంట్‌కు 538 విడుదల చేయగా శాసనసభకు మాత్రమే 4, ఇల్లెందు సెగ్మెంట్‌కు 1363 విడుదల చేయగా శాసనసభకు 35, లోక్‌సభకు 24 ఓట్లు దాఖలయ్యాయన్నారు. ఈ మూడు సెగ్మెంట్లకు సంబంధించి మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తాయి.
 
ఖమ్మం లోక్‌సభ పరిధిలోని ఖమ్మం సెగ్మెంట్‌కు సంబంధించి 4261 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేయగా శాసనసభకు 500, లోక్‌సభకు 300, పాలేరు సెగ్మెంట్‌కు 675 విడుదల చేయగా శాసనసభకు 10, లోక్‌సభకు 4, మధిర సెగ్మెంట్‌కు 809 విడుదల చేయగా శాసనసభకు 46, లోక్‌సభకు 40, వైరా సెగ్మెంట్‌కు 1146 విడుదల చేయగా శాసనసభకు 26, లోక్‌సభకు 26, సత్తుపల్లి సెగ్మెంట్‌కు 1422 విడుదల చేయగా శాసనసభకు 12, లోక్‌సభకు 12, కొత్తగూడెం సెగ్మెంట్‌కు 1588 విడుదల చేయగా శాససభకు 75, లోక్‌ఃసభకు 75, అశ్వారావుపేట సెగ్మెంట్‌కు 533 విడుదల చేయగా ఇప్పటివరకు ఒక్క ఓటు కూడా దాఖలు కాలేదని పేర్కొన్నారు. మొత్తం జిల్లాలోని 10 సెగ్మెంట్ల నుంచి 13,192 పోస్టల్ బ్యాలెట్లు విడుదల చేయగా 1279ఓట్లు దాఖలు అయినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement