బులెటిన్ బోర్డ్
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఖమారియా, నలంద) వివిధ విభాగాల్లో బ్యాక్‌లాగ్,
ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్‌లో
985 పోస్టులు
కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఖమారియా, నలంద) వివిధ విభాగాల్లో బ్యాక్‌లాగ్, రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: డీబీ వర్కర్, మెషినిస్ట్, ఎగ్జామినర్, ఎలక్ట్రోప్లేటర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ జనరల్, వెల్డర్, పెయింటర్, గ్రైండర్.
ఖాళీలు: 985, ఎంపిక విధానం: రాత పరీక్ష
దరఖాస్తుకు చివరి తేది: మే 28
వివరాలకు: www.i-register.org/ofkoreg
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో
141 పోస్టులు
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన వివిధ మెడికల్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఆక్జిలరి న ర్స్ మిడ్‌వైఫ్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, అకౌంటెంట్.
ఖాళీలు: 141, దరఖాస్తుకు చివరి తేది: మే 18
వివరాలకు: www.karimnagar.nic.in
ఐఐఆర్‌ఎంలో పీజీడీఎం కోర్సులు
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ (ఐఐఆర్‌ఎం) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీడీఎం)
విభాగాలు: ఫైనాన్షియల్ సర్వీసెస్, రిస్క్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఎనలిటిక్స్, మార్కెటింగ్, హెచ్‌ఆర్‌ఎం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, యాక్చూరియల్ సైన్స్.
వ్యవధి: రెండేళ్లు
అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు జీమ్యాట్/ క్యాట్ / గ్జాట్ /మ్యాట్ /ఏటీఎమ్‌ఏ/సీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: నేడు, రేపు
వివరాలకు:
www.iirmworld.org.in


