breaking news
	
		
	
  Bulletin Board
- 
      
                   
                               
                   
            AP: ఇక రోజూ బులెటిన్ బోర్డు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజలకు వారి చెంతనే అన్ని రకాల సేవలందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా యంత్రాంగం సరికొత్త పంథాను ఎంచుకుంది. ఇకపై గ్రామ/వార్డు సచివాలయాల్లో ఎన్ని ఫిర్యాదులు, వినతులు వచ్చాయన్నది ఎప్పటికప్పుడు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఏదైనా సమస్యను గడువులోగా పరిష్కరించకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు.. ఎవరి వద్ద పెండింగ్ ఉంది.. పెండింగ్‌లో ఉండడానికి కారణం.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టారు. వార్డు/గ్రామ సచివాలయాలు నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసేందుకే దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా సచివాలయాల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారం, పెండింగ్ అంశాలపై రోజూ బులెటిన్ జారీ చేస్తారు. ఇందులో పేర్కొన్న సమస్య ఏ అధికారి వద్ద పెండింగ్‌లో ఉందో గుర్తించి.. సంబంధిత అధికారికి పరిష్కారం కోసం పంపుతారు. గ్రామ/వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పెండింగ్ సమస్యలకు సంబంధించిన బులెటిన్‌ను అధికారులకు పంపిస్తారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించకపోతే చర్యలు నిర్దేశిత గడువులోగా సమస్యలను పరిష్కరించనివారిపై చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగుల్లో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు బులెటిన్‌లో తహసీల్దార్‌కు వచ్చిన మొత్తం అర్జీల సంఖ్య, పరిష్కరించిన అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువులోపు ఉన్న అర్జీల సంఖ్య, నిర్దేశిత గడువు దాటిన అర్జీల సంఖ్య, 24 గంటలు, 48 గంటలలోపు పరిష్కరించాల్సినవి ఉంటాయి. బులెటిన్‌ను ఆరు కేటగిరీలుగా విభజించారు. మండల రెవెన్యూ అధికారి (రెవెన్యూ), అసిస్టెంట్ ఇంజనీర్ (విద్యుత్), మండల రెవెన్యూ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ (వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాలు) సబ్ రిజిస్ట్రార్ (స్టాంపులు, రిజిస్ట్రేషన్లు), అసిస్టెంట్ ఇంజనీర్ (రవాణా, రోడ్లు, భవనాలు) కేటగిరీలుగా విభజించి.. ఎందులో ఎన్ని అర్జీలు వచ్చింది పొందుపరుస్తారు. జవాబుదారీతనం కోసమే.. గ్రామ/వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట గడువులోగా సేవలు అందించడంతోపాటు ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు బులెటిన్ బోర్డుకు శ్రీకారం చుట్టాం. దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. – వివేక్‌యాదవ్, కలెక్టర్, గుంటూరు జిల్లా - 
      
                    
బులెటిన్ బోర్డ్

 ఈసీఐఎల్‌లో 10 పోస్టులు
 హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వివిధ ఉద్యోగాల నియామకానికి ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ పోస్టులను ఏడాది కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది.
 ఖాళీలు: టెక్నికల్ ఆఫీసర్–4, సైంటిఫిక్ అసిస్టెంట్–3, జూనియర్ ఆర్టిజన్–3.
 విద్యార్హత: టెక్నికల్ ఆఫీసర్‌కు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్). సైంటిఫిక్ అసిస్టెంట్‌కి పైన పేర్కొన్న సబ్జెక్టుల్లో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిప్లొమా. జూనియర్ ఆర్టిజన్‌కు ఐటీఐ (ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/కంప్యూటర్స్/ఇన్స్ట్రుమెంటేషన్) . ఎస్సీ, ఎస్టీలకు సెకండ్ క్లాస్ (50 శాతం మార్కులు) ఉన్నా సరిపోతుంది. ఠి అనుభవం: సంబంధిత రంగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
 
 వయసు: 2017 జనవరి 31 నాటికి టెక్నికల్ ఆఫీసర్‌కు 30 ఏళ్ల లోపు; మిగిలిన రెండు పోస్టులకు 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఠి ఇంటర్వూ్య తేది: ఫిబ్రవరి 11 (శనివారం) ఇంటర్వూ్య వేదిక: ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల్లోని ఈసీఐఎల్ జోనల్, బ్రాంచ్ ఆఫీసుల్లో జరుగుతుంది.
 వెబ్సైట్: www.ecil.co.in 
 
 జాతీయ మేధో దివ్యాంగుల సాధికారత సంస్థలో
 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
 సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఈపీఐడీ–జాతీయ మేధో దివ్యాంగుల సాధికారత సంస్థ).. హెడ్ క్వార్టర్స్‌తోపాటు రీజనల్ సెంటర్లలో గెస్ట్ ఫ్యాకల్టీ/స్టాఫ్‌ను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ సంస్థను గతంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్(ఎన్ఐఎంహెచ్)గా పేర్కొనేవారు.
 ఖాళీలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ (రిహాబిలిటేషన్ సైకాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్, సీఆర్పీఎం, మెడికల్), లెక్చరర్ (రిహాబిలిటేషన్ సైకాలజీ, స్పెషల్/రెగ్యులర్ ఎడ్యుకేషన్, సీఆర్పీఎం, మెడికల్, ఫిజియోథెరపీ), రిహాబిలిటేషన్ థెరపిస్ట్/ఫార్మసిస్ట్/అసిస్టెంట్ లైబ్రేరియన్/స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్/వొకేషనల్ ఇన్స్ట్రక్టర్/ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, డేటా బేస్/నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సెక్షన్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (యూడీసీ, ఎల్డీసీ లెవల్), హెడ్ మాస్టర్, టీచర్(జనరల్).
 
 కాంట్రాక్ట్ కాల వ్యవధి: తొలుత ఆరు నెలల వరకు. తర్వాత మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది.
 విద్యార్హత: పోస్టును బట్టి ఎంఫిల్/పీహెచ్డీ/ఎంఈడీ/ఎండీ/డీఎం/ఎంఎస్/ఎంఎస్సీ/ఎండీఆర్ఏ/ఎల్ఎల్ఎం/ఎల్ఎల్బీ/ఎంబీఏ/ఎంటెక్/డిగ్రీ, అనుభవం. 
 ఇంటర్వూ్య తేదీలు: ఫిబ్రవరి 2, 3, 9, 10, 16, 17, 23, 24. ఠి ఇంటర్వూ్య వేదిక: ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, సికింద్రాబాద్ www.nimhindia.gov.in - 
      
                    
బులెటిన్ బోర్డ్

 
 
 ఏఎస్‌ఆర్‌బీలో రిక్రూట్మెంట్ బోర్డ్‌లో 22 సీనియర్ సైంటిస్ట్ పోస్టులు
 న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్బీ)... దేశ వ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్ అనుబంధ సంస్థలైన.. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామల్, ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డెరైక్టరేట్ ఆఫ్ గ్రౌండ్నట్ రీసెర్చ్లలోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 పోస్టు: సీనియర్ సైంటిస్ట్
 విభాగాలు: యానిమల్ (న్యూట్రిషన్, ఫిజియాలజీ), యానిమల్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, జెనిటెక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, అగ్రికల్చరల్ కెమికల్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫిష్ రిసోర్స్ మేనే జ్మెంట్ తదితర విభాగాలు.
 
 అర్హత: సంబంధిత విభాగంలో డాక్టోరల్ డిగ్రీ/ తత్సమాన విద్యార్హతతో పాటు అనుభవం ఉండాలి., దరఖాస్తుకు చివరి తేది: జనవరి 9, 2017.
 
 వివరాలకు: www.asrb.org.in
 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధాలో 14 ఫ్యాకల్టీ పోస్టులు
 కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్ధా (ఎన్ఐఎస్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించ నుంది.
 పోస్టు: ప్రొఫెసర్ (ఖాళీలు: 5); అసోసియేట్ ప్రొఫెసర్ (ఖాళీలు:6); సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఖాళీలు: 1); ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ (ఖాళీలు: 1); యోగ టీచర్ (ఖాళీలు: 1) (పార్ట్‌టైం).
 
 వయోపరిమితి: ఇంటర్వ్యూ తేది నాటికి సీనియర్ రీసెర్చ్‌ఫెలో పోస్టుకు 45 ఏళ్లు, ఇతర పోస్టులకు 64 ఏళ్లకు మించకూడదు.
 
 అర్హత: సంబంధిత విభాగంలో పీజీ/ సిద్ధాలో పీహెచ్డీ /బీఎస్ఎమ్మెస్ / ఎండీ (సిద్ధా)/ తత్సమాన విద్యార్హతతో పాటు అనుభవం ఉండాలి.
 
 ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 21. వివరాలకు: www.nischennai.org - 
      
                   
                               
                   
            బులెటిన్ బోర్డ్

 టాటా మెమోరియల్ సెంటర్లో 
 31 పోస్టులు
 పంజాబ్‌లోని టాటా మెమోరియల్ సెంటర్ 
 (టీఎంసీ)కి చెందిన హోమి బాబా క్యాన్సర్ హాస్పిటల్, సంగూర్ అండ్ హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో వివిధ విభాగాల్లో నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టు: ఇంజనీర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, మెడికల్ ఫిజిసిస్ట్, సైంటిఫిక్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, నర్స, సైంటిఫిక్ అసిస్టెంట్. ఖాళీలు: 31
 వయోపరిమితి: డిసెంబర్ 26 నాటికి ఇంజనీర్‌కి 45 ఏళ్లు, నర్స, సైంటిఫిక్ అసిస్టెంట్‌కి 30 ఏళ్లు, ఫార్మసిస్ట్, టెక్నీషియన్‌కి 27 ఏళ్లు, ఇతర పోస్టులకి 35 ఏళ్లు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 అర్హత: సంబంధిత పోస్టుకిగాను బీఈ/
 బీటెక్/ఎమ్మెస్సీ/ఐసీడబ్ల్యూఏ/ఎఫ్సీఏ/ ఎంబీఏ/బీఎస్సీ/బీఫార్మా/ఇంటర్మీడియెట్/ఎస్ఎస్సీ/తత్సమాన విద్యార్హతతో పాటు అనుభవం ఉండాలి.
 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది:
 డిసెంబర్ 26
 వివరాలకు: https://tmc.gov.in/
 
 ఈఎస్ఐ హాస్పిటల్లో34 పోస్టులు
 న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) హాస్పిటల్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
 పోస్టు: జూనియర్ రెసిడెంట్
 ఖాళీలు: 34 (ఎస్సీ-3, ఎస్టీ-5, ఓబీసీ- 9, ఇతరులు-17)
 వయోపరిమితి: నవంబర్ 30, 2016 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 అర్హత: ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత, నవంబర్ 30 నాటికి ఇంటర్న్‌షిప్ పూర్తవ్వాలి. 
 ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 14
 వివరాలకు: www.esic.nic.in
 
 ఐజీఐబీలో 16 పోస్టులు
 సీఎస్ఐఆర్ అనుబంధ సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. 
 పోస్టు: రీసెర్చ్ అసోసియేట్-ఐ (ఖాళీలు: 2), రీసెర్చ్ అసోసియేట్-ఐఐ (ఖాళీలు-1), ప్రాజెక్ట్ అసిస్టెంట్ - ఐఐఐ (ఖాళీలు:9), ప్రాజెక్ట్ అసిస్టెంట్- ఐఐ (ఖాళీలు-4)
 వయోపరిమితి: ప్రాజెక్ట్ అసిస్టెంట్ - ఐఐ పోస్టులకి 30 ఏళ్లు, మిగతా పోస్టులకి 35 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్డీ/ఎమ్మెస్సీ/ఎంటెక్ /ఎంసీఏ/బీటెక్ / ఎంబీబీఎస్/ తత్సమాన విద్యార్హతతో పాటు అనుభవం ఉండాలి.
 దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 13
 వివరాలకు:www.igib.res.in
 
 ఐఐపీఏలో 13 పోస్టులు
 న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపీఏ).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
 పోస్టు: సెక్టార్ ఎక్స్పర్ట్ (ఎడ్యుకేషన్, ఫుడ్ సేఫ్టీ) (ఖాళీలు-2); మార్కెట్ రీసెర్చ్ అసోసియేట్ (ఖాళీలు -1); జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (ఖాళీలు-1); జూనియర్ కౌన్సిలర్ (ఖాళీలు-7); ఆఫీస్ అసిస్టెంట్ (ఖాళీలు-1), ట్రైనీ కౌన్సిలర్ (ఖాళీలు-2)
 అర్హత: సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేట్/పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ/ తత్సమాన విద్యార్హతతోపాటు అనుభవం ఉండాలి.
 ఇంటర్వ్యూ తేది: డిసెంబర్ 7
 వివరాలకు: www.iipa.org.in
 - 
      
                    
బులెటిన్ బోర్డు

 మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో వివిధ పోస్టులు
 
 ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్‌కి చెందిన హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కార్యాలయం వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టు: జూనియర్ అసిస్టెంట్ (17), టైపిస్ట్ (13), డ్రైవర్ (2), కాపీస్ట్ (3), ఫీల్డ్ అసిస్టెంట్ (3), ఎగ్జామినర్ (3), స్టెనోగ్రాఫర్ గ్రేడ్- ఐఐఐ (3).
 వయోపరిమితి: జూలై 1, 2016 నాటికి 18 నుంచి 34 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 అర్హత: సంబంధిత విభాగంలో తత్సమాన విద్యార్హత ఉండాలి.
 ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 24
 వివరాలకు: www.ecourts.gov.in/ap
 
 టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియాలో స్పెషల్ రిక్రూట్మెంట్ 
 న్యూఢిల్లీలోని టెలీకమ్యూనికేషన్స కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెచ్ఆర్), ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్. ఖాళీలు: 4 వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2016 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 18 వివరాలకు: www.tcil-india.com
 
 నార్తఈస్టర్న స్పేస్ అప్లికేషన్స్ సెంటర్లో సైంటిస్ట్/ ఇంజనీర్ పోస్టులు
 మేఘాలయలోని నార్తఈస్టర్న స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ)... వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టు: సైంటిస్ట్/ఇంజనీర్
 విభాగాలు: స్పేస్ అండ్ అటామిక్ సైన్స్, జియోసైన్స్, జియోఇన్ఫర్మాటిక్స్ అప్లికేషన్స్, అర్బన్ ప్లానింగ్
 ఖాళీలు: 4. అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/ఎంటెక్/మాస్టర్ ఆఫ్ ప్లానింగ్/తత్సమాన విద్యార్హత ఉండాలి. వయోపరిమితి: అక్టోబర్ 25, 2016 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 25. వివరాలకు: www.nesac.gov.in - 
      
                    
బులెటిన్ బోర్డు

 బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియాలో 15 పోస్టులు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టు: యూఐ డిజైనర్, డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, టెస్టర్.,
 ఖాళీలు: 15. అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఎంసీఏ/బీసీఏ/ బీఎఫ్ఏ/ ఎంఎఫ్ఏ/ బీ.ఆర్క్/బీ.డిజైన్/ఎం.డిజైన్/ పీజీ డిప్లొమా ఇన్ వెబ్ డిజైన్/ తత్సమాన విద్యార్హత ఉండాలి.
 దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 17. వివరాలకు: www.becil.com
 
 ఐఐటీ బాంబేలో 12 పోస్టులు
 బాంబేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ కన్సల్టెంట్ సెంటర్లో.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: సీనియర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ - ఫీల్డ్ ఇంజనీర్., ఖాళీలు: 12. అర్హత: సీనియర్ ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులకు డెమోగ్రఫీ/స్టాటిస్టిక్స్‌లో పీహెచ్‌డీతో పాటు కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ ఎంటెక్/ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఐటీఐ డిప్లొమా/తత్సమాన అర్హతతో పాటు అనుభవం ఉండాలి.
 దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 14. వివరాలకు: www.ircc.iitb.ac.in
 
 నిఫ్ట్‌లో గ్రూప్ - సీ పోస్టులు
 భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టు: స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ (అకౌంట్స్), మెషిన్ మెకానిక్, అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్ (గర్ల్స్), ల్యాబ్ అసిస్టెంట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, జూనియర్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్. ఖాళీలు: 23 దరఖాస్తు విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును నిర్దేశిత నమూనాలో పూర్తిచేసి - ది డెరైక్టర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నిఫ్ట్ క్యాంపస్, ఐడీసీవో ప్లాట్ నెం.24, కేఐఐటీ ఆఫ్ మేనేజ్మెంట్స్కూల్ ఎదురుగా, పాటియా, భువనేశ్వర్-751024కి గడువులోగా పంపాలి.
 దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 24 (సెప్టెంబర్ 21గా ఉన్న చివరి తేదీని పొడిగించారు). 
 వివరాలకు: www.nift.ac.in
 - 
      
                    
బులెటిన్ బోర్డు

 ఎన్ఎల్సీ ఇండియాలో ఇండస్ట్రియల్ ట్రైనీ పోస్టులు
 ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
 పోస్టు: ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్)
 ఖాళీలు: 28
 అర్హత: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)/ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
 వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2016 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
 స్టైఫండ్: నెలకు రూ.10,000 అందజేస్తారు.
 ఇంటర్వ్యూ తేది: సెప్టెంబర్ 23
 వివరాలకు: ఠీఠీఠీ.ఛిజీఛీజ్చీ.ఛిౌఝ
 కోల్‌కతా ఐఐఎస్ఈఆర్లో 10 పోస్టులు
 కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్, అకౌంటెంట్, పర్సనల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, సాఫ్ట్వేర్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. ఖాళీలు: 10
 అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ/పీహెచ్డీ/బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంసీఏ/పీజీడీసీఏ/తత్సమాన విద్యార్హత ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటర్-బేస్డ్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌లో పరిజ్ఞానం ఉండాలి.
 ఆన్లైన్ ద రఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 30
 వివరాలకు: www.iiserkol.ac.in
 - 
      
                   
                               
                   
            బులెటిన్ బో్ర్డ్

 రిటైర్డ్ ఉద్యోగులకు కన్సల్టెంట్ పోస్టులు
 కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వయంప్రతిపత్తి సంస్థలు, బ్యాంకులు తదితర సంస్థల్లో ఉద్యోగం చేసి ఇటీవల పదవీ విరమణ పొందినవారిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్లుగా నియమించేందుకు కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అర్హత: అండర్ సెక్రెటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రొటోకాల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, పీపీఎస్, పీఎస్, పీఏలుగా రిటైరైనవారు మాత్రమే అర్హులు.
 
 అనుభవం: పైన పేర్కొన్న ప్రభుత్వ సంస్థల్లోని సాధారణ పరిపాలనకు సంబంధించిన అనుభవంతోపాటు కంప్యూటర్‌పై పనిచేయగల నేర్పు ఉండాలి. సమాచార హక్కు వ్యవహారాల్లో అనుభవాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు. ఇటీవల పదవీ విరమణ పొందినవారికి ప్రాధాన్యత ఇస్తారు.
 వేతనం: చివరిసారిగా అందుకున్న వేతనం మైనస్ పెన్షన్ ప్లస్ డీఏ (లేదా) అభ్యర్థి అనుభవాన్ని బట్టి సీఐసీ నిర్ణయిస్తుంది.
 
 కాంట్రాక్ట్ వ్యవధి: తొలుత ఆరు నెలల కాల వ్యవధికి నియమిస్తారు. తర్వాత సంస్థ అవసరం, అభ్యర్థి పనితీరును బట్టి పొడిగించే అవకాశం ఉంది.
 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పంపాలి.
 చిరునామా: సుశీల్ కుమార్, డిప్యూటీ సెక్రెటరీ (అడ్మిన్), సీఐసీ, సెకండ్ ఫ్లోర్, ‘బి’ వింగ్, అగస్త్య క్రాంతి భవన్, భికాజి కామా ప్లేస్, న్యూఢిల్లీ, 110066.
 
 చివరి తేది: ఆగస్టు 26
 వివరాలకు: ఎంప్లాయ్మెంట్ న్యూస్ (2016 ఆగస్టు 6-12 సంచిక) చూడొచ్చు.
 
 జాకీర్ హుస్సేన్ స్కూల్లో 21 టీచింగ్ పోస్టులు
 ఢిల్లీలోని జఫ్రాబాద్ ప్రాంతంలో గల డాక్టర్ జాకీర్ హుస్సేన్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో (ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో) టీచర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
 
 మొత్తం పోస్టులు: 21
 పోస్టుల వారీ ఖాళీలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ) ఉర్దూ-1, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) ఇంగ్లిష్-2, టీజీటీ మ్యాథ్స్-3, టీజీటీ హిందీ-1, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)-2, టీజీటీ డొమెస్టిక్ సైన్స్-1, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్-1, అసిస్టెంట్ టీచర్-8, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ)-1, లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ)-1.
 
 వేతనం: టీచర్స్‌కి రూ.9300-34,800+గ్రేడ్ పే; యూడీసీ, ఎల్డీసీలకు రూ.5,200- 20,200.
 విద్యార్హత: పీజీటీకి ఎంఏ, బీఈడీ; టీజీటీలకు కనీసం 45 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈడీ; టీజీటీ(డొమెస్టిక్ సైన్స్) పోస్టుకు హోమ్ సైన్స్‌లో డిప్లొమా/బీఎస్సీతోపాటు ట్రైనింగ్/ఎడ్యుకేషన్‌లో డిగ్రీ/డిప్లొమా; పీఈటీకి గ్రాడ్యుయేషన్‌తోపాటు ఫిజికల్ ట్రైనింగ్‌లో డిప్లొమా/బీపీఈడీ; స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌కి గ్రాడ్యుయేషన్‌తోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ; అసిస్టెంట్ టీచర్‌కి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత; యూడీసీకి గ్రాడ్యుయేషన్; ఎల్డీసీకి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు నిమిషానికి 30 పదాలను టైపింగ్ చేయగలగాలి.
 
 గమనిక: టీచర్ పోస్టులకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ) ఉత్తీర్ణులే దరఖాస్తు చేయాలి. అన్ని పోస్టులకు సెకండరీ లెవల్/తత్సమాన స్థాయి వరకు ఉర్దూ కోర్స్-ఏ ఉత్తీర్ణత తప్పనిసరి.
 
 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులకు అటెస్ట్ చేసిన విద్యార్హతల ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి స్కూల్ మేనేజర్‌కు పోస్ట్‌లో పంపాలి
 చివరి తేది: ఆగస్టు 27
 వివరాలకు: ఎంప్లాయ్మెంట్ న్యూస్ (2016 ఆగస్టు 6-12 సంచిక) చూడొచ్చు.
 - 
      
                   
                               
                   
            బులెటిన్ బోర్డ్

 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్‌లో సైంటిస్టులు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్
 బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (ఎన్ఐఆర్ఎం).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వాటి వివరాలు..
 
 మొత్తం ఖాళీలు: 23 (సైంటిస్ట్-గఐ: 1, సైంటిస్ట్-గ: 1, సైంటిస్ట్-ఐఐ: 5, సైంటిస్ట్-ఐ: 2, సైంటిఫిక్ అసిస్టెంట్-ఐ: 7, జేఆర్ఎఫ్: 1, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్: 1, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, ఆఫీస్ అసిస్టెంట్-ఐ: 1, ఆఫీస్ అసిస్టెంట్-ఐ (హిందీ): 1, ల్యాబొరేటరీ అసిస్టెంట్-ఐ: 2.
 
 విద్యార్హత: ఫస్ట్ క్లాస్ డిగ్రీతోపాటు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్డీ, ఆయా పోస్టులకు తగిన పని అనుభవం ఉండాలి.
 
 వేతనం: సైంటిస్ట్-గఐ, గలకు రూ.37,400-67,000; సైంటిస్ట్-ఐఐ, ఐలకు రూ. 15,600-39,100; సైంటిఫిక్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్లకు రూ.5,200-20,200; జేఆర్ఎఫ్కు రూ.16,000; ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు రూ.15,600-39,100.
 
 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో దరఖాస్తును పూర్తి చేసి, ధ్రువీకరణ పత్రాలను జతపరిచి, కింది అడ్రస్‌కు రిజిస్టర్ పోస్టులో పంపాలి.
 
 చిరునామా: రిజిస్ట్రార్, ఎన్ఐఆర్ఎం, హెడ్ ఆఫీస్, ఔటర్ రింగ్ రోడ్, ఈశ్వర్ నగర్, బీఎస్కే-2 స్టేజ్, బెంగళూరు, 560070
 చివరి తేదీ: 2016 ఆగస్టు 31, వెబ్సైట్: www.nirm.in
 
 రీజనల్ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ లేబొరేటరీలో 18 పోస్టులు
 రీజనల్ వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నొస్టిక్ లేబొరేటరీ.. వివిధ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. వాటి వివరాలు..
 
 మొత్తం పోస్టులు: 18 (మెడికల్ రీసెర్చ్ సైంటిస్ట్-4, ల్యాబ్ టెక్నీషియన్-4, రీసెర్చ్ అసిస్టెంట్-2, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, ల్యాబ్ హెల్పర్/అటెండెంట్-6)
 
 విద్యార్హత: సైంటిస్ట్లకు పీజీ, పీహెచ్డీ, ఆర్ అండ్ డీలో అనుభవం; ల్యాబ్ టెక్నీషియన్‌కు బీఎస్సీ, డీఎంఎల్టీ, ల్యాబ్‌లో ఐదేళ్ల అనుభవం; ఆర్ఏకి లైఫ్ సెన్సైస్‌లో పీజీ, ఏడాది అనుభవం; డీఈవోకు బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్, ఏడాది అనుభవం; హెల్పర్‌కు టెన్తతోపాటు ల్యాబ్‌లో పని అనుభవం ఉండాలి.
 
 వేతనం: సైంటిస్ట్ పోస్టులకు నెలకు కనీసం రూ.33,306. గరిష్టం రూ.53,680. ల్యాబ్ టెక్నీషియన్‌కు రూ.18,360; రీసెర్చ్ అసిస్టెంట్(ఆర్ఏ)కు రూ.22,120; డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)కు రూ.16,000; ల్యాబ్ హెల్పర్‌కు రూ.10,000.
 
 ఇంటర్వ్యూ తేదీలు: సైంటిస్ట్ పోస్టులకు 2016 ఆగస్టు 24; ల్యాబ్ టెక్నీషియన్, ఆర్ఏలకు ఆగస్టు 25; డీఈవో, హెల్పర్ పోస్టులకు ఆగస్టు 26.
 
 ఇంటర్వ్యూ వేదిక: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కలరా, ఎంటెరిక్ డిసీజెస్, పీ-33, సీఐటీ రోడ్, స్కీమ్ ఎక్స్ఎమ్, బెలియాఘట, కోల్‌కతా, 700010. 
 వెబ్సైట్: www.niced.org.in
 - 
      
                   
                               
                   
            బులెటిన్ బోర్డ్

 
 బెల్ - మచిలీపట్నం యూనిట్లో 35 పోస్టులు
 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్).. మచిలీపట్నం యూనిట్లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 మొత్తం ఖాళీలు: 35. అవి పోస్టుల వారీగా..
 1. ట్రైనీ ఇంజనీరింగ్ అసిస్టెంట్-6 (ఎలక్ట్రానిక్స్-2, మెకానికల్-4)
 2. టెక్నీషియన్-22 (ఎలక్ట్రానిక్స్-4, మెషినిస్ట్/టర్నర్-3, ఫిట్టర్-15)
 3. క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ‘సీ’-5
 4. జూనియర్ సెక్యూరిటీ సూపర్వైజర్-2.
 వేతనం: ఇంజనీరింగ్ అసిస్టెంట్‌కు రూ.10,050-25,450+అలవెన్సులు. టెక్నీషియన్, క్లర్క్ పోస్టులకు రూ.8740-22,150+అలవెన్సులు. సూపర్వైజర్కు రూ.10,050- రూ.25,450+అలవెన్సులు.
 విద్యార్హత: ఇంజనీరింగ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టులకు డిప్లొమా; టెక్నీషియన్‌కు పదో తరగతితోపాటు ఐటీఐ, అప్రెంటీస్; సూపర్వైజర్కు పదో తరగతితోపాటు సాయుధ బలగాల్లో 15 ఏళ్ల అనుభవం, రిటైరయ్యే నాటికి జేసీఓ/తత్సమాన హోదా ఉండాలి.
 ఎంపిక విధానం: మొదటి మూడు రకాల పోస్టులకు రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా; సెక్యూరిటీ పోస్టుకు ఫిజికల్ ఎడ్యూరన్స్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
 దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో దరఖాస్తును పూర్తిచేసి, ధ్రువీకరణ పత్రాల నకళ్లు, అప్లికేషన్ ఫీజు చలానా జత చేసి కింది చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.
 దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 చలానా తీయాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు.
 చివరి తేదీ: 2016 సెప్టెంబర్ 8.
 చిరునామా: డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్), బెల్, పోస్ట్ బాక్స్ నంబర్-26, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం, 521001, ఆంధ్రప్రదేశ్.
 వెబ్సైట్: www.bel-india.com
 పశ్చిమ గోదావరి జిల్లాలో 6 ‘మల్టీపర్పస్’ పోస్టులు
 ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 6 మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అసిస్టెంట్స్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన వెలువడింది. అభ్యర్థులు డ్రైవింగ్ లెసైన్స్‌తోపాటు సొంత వాహనాన్ని కలిగి ఉండాలి.
 వేతనం: రూ.8,000, విద్యార్హత: 2016 జూలై 1 నాటికి కింది విద్యార్హతలను కలిగి ఉండాలి.
 కేటగిరి-1: బీఎఫ్ఎస్సీ, కేటగిరి-2: ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా
 కేటగిరి-3: బీఎస్సీ (ఫిషరీస్)/బీఎస్సీ (ఆక్వాకల్చర్)/బీఎస్సీ (జువాలజీ)
 వయసు: 2016 జూలై 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్టం 40 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంది.
 ఎంపిక: విద్యార్హతల మార్కులకు 80 శాతం; ఇంటర్వ్యూకి 20 శాతం వెయిటేజీ ఇస్తారు.
 దరఖాస్తు: నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను ‘ఉప సంచాలకులు, మత్స్య శాఖ, శ్రీనివాస నగర్, పోస్టల్ కాలనీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా’ చిరునామాకు స్వయంగా/పోస్ట్ ద్వారా పంపొచ్చు.
 చివరి తేదీ: ఆగస్టు 26, వెబ్సైట్: westgodavari.org - 
      
                    
ఈసీఐఎల్, హెచ్ఎంటీలో ఉద్యోగాలు...

 ఈసీఐఎల్‌లో 14 పోస్టులు
 హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
 పోస్టులు: సైంటిస్ట్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిసన్, సీనియర్ ఆర్టిసన్.
 ఖాళీలు: 14
 
 అర్హత: 60 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/మెకానికల్ విభాగాల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
 ఆర్టిసన్ పోస్టులకు అర్హత: ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ ఫిట్టర్ / షీట్ మెటల్ విభాగాల్లో రెండేళ్ల వ్యవధి గల ఐటీఐలో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగాల్లో అనుభవం ఉండాలి.
 ఎంపిక విధానం: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తుని నిర్దేశిత నమూనాలో పూర్తి చేసి ఆగస్టు 3న 
 ‘ఇంటి నెం: 47-09-28, ముకుంద సేవా అపార్ట్మెంట్స్, థర్డ్ లేన్ ద్వారకా నగర్, విశాఖపట్నం’లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలి.
 ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 3
 వివరాలకు: www.ecil.co.in
 ......................
 హెచ్ఎంటీలో 16 పోస్టులు
 బెంగళూరులోని హెచ్ఎంటీ మెషీన్ టూల్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టులు: జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఫైనాన్స్ ఆఫీసర్.
 విభాగాలు: ఫైనాన్స్, హెచ్ఆర్
 ఖాళీలు: 16
 అర్హత: సంబంధిత విభాగంలో ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ (ఇంటర్)/ ఎంబీఏ (ఫైనాన్స్/హెచ్), ఎంఎస్‌డబ్ల్యూ/ ఎన్ఐపీఎం/ పీజీడీపీఎం/తత్సమాన అర్హత.
 ఎంపిక విధానం: అర్హత గల వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
 దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 20
 వివరాలకు: www.hmtmachinetools.com - 
      
                   
                               
                   
            బులెటిన్ బోర్డ్

 యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్‌లో 112 నాన్ టీచింగ్ పోస్టులు
 యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్.. నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 మొత్తం ఖాళీలు: 112 (డిప్యూటీ రిజిస్ట్రార్-1, ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్-1, అసిస్టెంట్ లైబ్రేరియన్-4, ప్రొఫెషనల్ అసిస్టెంట్-7, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 5, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-8, టెక్నికల్ అసిస్టెంట్-25, ల్యాబ్ అసిస్టెంట్-30, ల్యాబ్ అటెండెంట్-21, యానిమల్ అటెండెంట్-3, ప్లేస్మెంట్ ఆఫీసర్-1, ఎస్టేట్ మేనేజర్-1, జూనియర్ ఇంజనీర్-1, హిందీ ట్రాన్స్‌లేటర్-1, డిప్యుటేషన్‌పై లా ఆఫీసర్-1, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్-1, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-1).
 దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 10.
 వెబ్సైట్: www.allduniv.ac.in
 
 ఎయిర్ ఇండియాలో 18 పోస్టులు
 ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్.. రెవెన్యూ మేనేజ్మెంట్ ఎనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
 మొత్తం ఖాళీలు: 18 (అన్ రిజర్వ్డ్-11, ఓబీసీ-04, ఎస్సీ-2, ఎస్టీ-1). విద్యార్హత: పీజీ (బ్యాచిలర్ డిగ్రీలో స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, ఆపరేషన్స్ రీసెర్చ్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్టులు గల వారికి ప్రాధాన్యం).
 ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ.
 దరఖాస్తుకు చివరి తేదీ: మే 25.
 వెబ్సైట్: www.airindiaexpress.in
 
 
 బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీజీ కోర్సులు
 బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్)- మెస్రా.. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతోంది.
 కోర్సులు:
 ఎంఈ: ఆటోమేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, మెకానికల్, సాఫ్ట్వేర్, స్పేస్ అండ్ రాకెట్రీ ఇంజనీరింగ్
 ఎంటెక్: బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎనర్జీ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్. ఇంకా.. ఎంఫార్మసీ, ఎంఎస్సీ.
 దరఖాస్తు: ఆన్లైన్లో
 చివరి తేదీ: జూన్ 2
 వెబ్సైట్: www.bitmesra.ac.in
 
 
 జేఎన్ఏఎఫ్ఏయూలో ఫైన్ ఆర్ట్స్, డిజైన్ కోర్సులు..
 జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్).. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.
 అర్హత: ఇంటర్మీడియెట్
 దరఖాస్తుకు చివరి తేది: జూన్ 10
 వెబ్సైట్: www.jnafau.ac.in
 - 
      
                   
                               
                   
            బులెటిన్ బోర్డ్

 ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్‌లో
 985 పోస్టులు
 కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ఖమారియా, నలంద) వివిధ విభాగాల్లో బ్యాక్లాగ్, రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 పోస్టులు: డీబీ వర్కర్, మెషినిస్ట్, ఎగ్జామినర్, ఎలక్ట్రోప్లేటర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ జనరల్, వెల్డర్, పెయింటర్, గ్రైండర్.
 ఖాళీలు: 985, ఎంపిక విధానం: రాత పరీక్ష
 దరఖాస్తుకు చివరి తేది: మే 28
 వివరాలకు: www.i-register.org/ofkoreg
 
 నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో
 141 పోస్టులు
 నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిన వివిధ మెడికల్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 పోస్టులు: మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఆక్జిలరి న ర్స్ మిడ్వైఫ్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, అకౌంటెంట్.
 ఖాళీలు: 141, దరఖాస్తుకు చివరి తేది: మే 18
 వివరాలకు: www.karimnagar.nic.in
 
 ఐఐఆర్‌ఎంలో పీజీడీఎం కోర్సులు
 హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (ఐఐఆర్ఎం) వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
 కోర్సులు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ (పీజీడీఎం)
 విభాగాలు: ఫైనాన్షియల్ సర్వీసెస్, రిస్క్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎనలిటిక్స్, మార్కెటింగ్, హెచ్ఆర్ఎం, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, యాక్చూరియల్ సైన్స్.
 వ్యవధి: రెండేళ్లు
 అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు జీమ్యాట్/ క్యాట్ / గ్జాట్ /మ్యాట్ /ఏటీఎమ్ఏ/సీమ్యాట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
 ఇంటర్వ్యూ తేదీలు: నేడు, రేపు
 వివరాలకు:
 www.iirmworld.org.in
 - 
      
                   
                               
                   
            బులెటిన్ బోర్డ్

 జాబ్స్
 సీసీఐలో రీసెర్చ్ అసోసియేట్స్/ ప్రొఫెషనల్స్
 న్యూఢిల్లీలోని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసోసియేట్స్/ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 విభాగాలు: లా, ఎకనామిక్స్, ఎఫ్ఏ, ఖాళీలు: 15
 అర్హతలు: సంబంధిత పోస్టుకు ఆయా విభాగంలో డిగ్రీ/పీజీ/తత్సమాన అర్హతతోపాటు అనుభవం ఉండాలి.
 దరఖాస్తుకు చివరి తేది: జూన్ 20
 వివరాలకు: www.cci.gov.in
 
 ఎయిమ్స్ న్యూఢిల్లీలో సీనియర్ రెసిడెంట్స్
 న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
 (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్స్/ సీనియర్ డిమానుస్ట్రేటర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 విభాగాలు: అనస్థీషియాలజీ (కార్డియాక్, న్యూరో), ఆఫ్తల్మాలజీ, న్యూరో రేడియాలజీ, అనాటమీ, డెంటల్, ఫోరెన్సిక్ మెడిసిన్. ఖాళీలు: 326
 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 29
 వివరాలకు: www.aiimsexams.org
 
 
 అడ్మిషన్లు
 ఐఐఎస్ఈఆర్ భోపాల్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్
 భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)వివిధ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తుఆహ్వానిస్తోంది.
 విభాగాలు: కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్.
 అర్హత: సంబంధిత విభాగంలో ఎంటెక్/ఎంఈ/ఎంఎస్ డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించాలి.
 ఎంపిక విధానం: సీఎస్ఐఆర్-జేఆర్ఎఫ్/ యూజీసీ-జేఆర్ఎఫ్/గేట్/యూజీసీ/సీఎస్ఐఆర్/జెస్ట్లతో అర్హత సాధించాలి.ఎంపికైనవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
 
 ఫైనాన్సియల్ అసిస్టెంట్: నెలకు
 రూ. 25000ల ఫెలోషిప్ ఇస్తారు.
 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 25
 వివరాలకు: www.iiserb.ac.in
 - 
      
                   
                               
                   
            బులెటిన్ బోర్డ్

 ఎయిమ్స్ భోపాల్‌లో 
 జూనియర్ రెసిడెంట్స్ పోస్టులు
 భోపాల్‌లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో జూనియర్ రెసిడెంట్స్ (నాన్-అకడమిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు
 ఆహ్వానిస్తోంది.
 
 పోస్టుల వివరాలు: జూనియర్ రెసిడెంట్స్ (నాన్-అకడమిక్)
 ఖాళీలు: 50
 అర్హతలు: అభ్యర్థులు ఎంబీబీఎస్/ బీడీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి (ఇంటర్న్‌షిప్ కూడా పూర్తవ్వాలి) లేదా ఎంసీఐ గుర్తింపు పొందిన తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. 10, జూలై 2014 - 10, జూన్ 2016 మధ్య కాలంలో ఎంబీబీఎస్/బీడీఎస్‌లో
 ఉత్తీర్ణత సాధించినవారు (ఇంటర్న్‌షిప్ కూడా పూర్తవ్వాలి) మాత్రమే అర్హులు. 
 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: జూన్ 10
 వివరాలకు: www.aiimsbhopal.edu.in.
 
 తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్
 కార్పొరేషన్లో ఫీల్డ్ సూపర్వైజర్లు
 తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్వైజర్స్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టు: సూపర్వైజర్స్
 ఖాళీలు: 23
 అర్హత : సీడ్ టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి
 ఎంపిక: డిప్లొమాలో సాధించిన మార్కుల ద్వారా ఎంపిక ఉంటుంది.
 దర ఖాస్తుకు చివరి తేది: మే 21
 వివరాలకు: www.tssdcl.org
 
 అడ్మిషన్లు
 ఎస్పీఏలో డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ -2016
 
 భోపాల్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్పీఏ).. డాక్టోరల్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 
 డాక్టోర ల్ ప్రోగ్రాం
 అర్హత: 60 శాతం మార్కులతో ఆర్కిటెక్చర్/ప్లానింగ్/ టెక్నాలజీ/ డిజైన్ సంబంధిత అంశాల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ / బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్‌లో డిగ్రీ ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం, కనీసం ఒక అంశం జర్నల్/ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురితమై ఉండాలి.
 
 పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఆర్కిటెక్చర్
 విభాగాలు: మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (కన్జర్వేషన్, ల్యాండ్ స్కేప్, అర్బన్ డి జైన్)
 అర్హత : బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ తోపాటు ఏడాది అనుభవం లేదా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఉండాలి. రెండు విభాగాల్లో కనీసం 55 శాతం అగ్రిగేట్ మార్కులుండాలి.
 
 ముఖ్య తేదీలు
 దరఖాస్తుకు చివరి తేది: మే 16
 డాక్టోరల్ ప్రోగ్రాం ప్రవేశ పరీక్ష : జూన్ 24
 వెబ్సైట్: www.spabhopal.ac.in 
 - 
      
                    
ఉద్యోగాలు

 బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్లో 138 పోస్టులు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టులు: జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్.
 ఖాళీలు: 138
 దరఖాస్తుకు చివరి తేది: మే 10
 వెబ్సైట్: www.bmrc.co.in 
 
 ఐఐఏపీలో 21 పోస్టులు
 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏపీ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 పోస్టులు: ఇంజనీర్, సెక్షన్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, మెకానిక్, జూనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్
 ఖాళీలు: 21
 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మే 13
 వెబ్సైట్: www.iiap.res.in 
 
 ఎన్ఐఆర్డీపీఆర్లో పీజీడీఆర్‌డీఎం
 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)-హైదరాబాద్.. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ (పీజీడీఆర్‌డీఎం) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
 వ్యవధి: ఏడాది
 దరఖాస్తుకు చివరి తేది: మే 18
 వెబ్సైట్: www.nird.org.in 


