'చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడిది?' | YSRCP mlas fires on cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడిది?'

Feb 25 2016 7:38 PM | Updated on Aug 14 2018 11:26 AM

'చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడిది?' - Sakshi

'చంద్రబాబుకు అంత డబ్బు ఎక్కడిది?'

చంద్రబాబునాయుడికి అసలు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు.

నెల్లూరు/చిత్తూరు: తాను ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కావలి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్మూధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.

ఇక, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చంద్రబాబునాయుడి తీరుపై స్పందిస్తూ ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబుకు అసలు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చంద్రబాబు దగ్గర జోకర్లుగా మిగిలిపోవడం ఖాయమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement