లింగాయపాలెం రైతుకు వైఎస్ఆర్ సీపీ నేతల భరోసా | ysrcp leaders assures lingayapalem farmer | Sakshi
Sakshi News home page

లింగాయపాలెం రైతుకు వైఎస్ఆర్ సీపీ నేతల భరోసా

Dec 11 2015 6:55 PM | Updated on Oct 1 2018 2:44 PM

రాజధాని ప్రాంతంలో భూములివ్వని వారిపై ప్రభుత్వ దాష్టికానికి పరాకాష్ఠగా నిలిచిన.. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో సీఆర్డీఏ అధికారులు ధ్వంసం చేసిన అరటితోటను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు.

గుంటూరు: రాజధాని ప్రాంతంలో భూములివ్వని వారిపై ప్రభుత్వ దాష్టికానికి పరాకాష్ఠగా నిలిచిన.. తుళ్లూరు మండలం లింగాయపాలెం గ్రామంలో సీఆర్డీఏ అధికారులు ధ్వంసం చేసిన అరటితోటను శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు. బాధితుడు రైతు రాజేష్కు వైఎస్ఆర్ సీపీ నేతలు భరోసా ఇచ్చారు.

ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వనందుకు గూడ రాజేష్ అనే రైతుకు చెందిన ఏడెకరాల అరటి తోటను అధికారులు రాత్రికి రాత్రే దున్ని జేసీబీలతో చదును చేయించారు. అధికారుల చర్యపై వైఎస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement