మండలంలోని నాగల్‌కొండ పంచాయతీ పరిధి దేవాపాటర్ గ్రామానికి చెందిన గోర్సెంగే బాలాజీ(35) అనే యువ రైతు బుధవారం తన చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం... బాలాజీ ఈ ఏడాది మొదటిసారిగా తనకున్న ఐదు ఎకరాల భూమిలో పత్తి పంట సాగు ప్రారంభించాడు.
యువ రైతు ఆత్మహత్య
Jul 27 2016 11:42 PM | Updated on Nov 6 2018 7:56 PM
నార్నూర్ : మండలంలోని నాగల్‌కొండ పంచాయతీ పరిధి దేవాపాటర్ గ్రామానికి చెందిన గోర్సెంగే బాలాజీ(35) అనే యువ రైతు బుధవారం తన చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం... బాలాజీ ఈ ఏడాది మొదటిసారిగా తనకున్న ఐదు ఎకరాల భూమిలో పత్తి పంట సాగు ప్రారంభించాడు. మొదటిసారిగా విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రెండోసారి వేశాడు. పత్తిలో కలుపు మొక్కలు అధికంగా ఉండడంతో రెండు రోజులుగా గడ్డి మందును పిచికారి చేస్తున్నాడు. కలుపు మొక్కలు అధికంగా తయారవడంతో ఇంకా పెట్టుబడి పెట్టలేక చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శశికళాబాయి, నలుగురు పిల్లలున్నారు. రైతు ఆత్మహత్య విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై రాణాప్రతాప్ తెలిపారు.
Advertisement


